చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి అప్పలరాజు..!!

ఏపీ మంత్రి అప్పలరాజు టిడిపి నేతలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీలో ప్రతిపక్ష నేత చేస్తున్న రాజకీయం చూస్తుంటే చాలా నీచంగా దిగజారి పోయినట్టు పరిస్థితి ఉందని తెలిపారు.

 Minister Appalaraju Angry With Chandrababu-TeluguStop.com

పొరపాటున ఏరియా ఆసుపత్రి ఘటన జరిగితే దానికి ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయటం దారుణమని అన్నారు.బాధ్యతగా హుందాగా వ్యవహరించాల్సిన వారు .ఇలాంటి కీలక టైంలో క్యాండిల్ నిరసన చేపట్టడం బాధ్యత రహితమని పేర్కొన్నారు.

బయట పరిస్థితులు ఇలా ఉండగా టీడీపీ నాయకులకు నిరసన చేపట్టడానికి అసలు సిగ్గుందా.? కడుపుకి అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అంటూ మినిస్టర్ అప్పలరాజు ఏకిపారేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పుష్కరాలలో దాదాపు నలభై మంది చనిపోయారు.

 Minister Appalaraju Angry With Chandrababu-చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి అప్పలరాజు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఘటనపై చంద్రబాబు పై హత్యాయత్నం కేసు పెట్టాలి అప్పుడు బుద్ధి వచ్చేది అని అన్నారు.ఇప్పుడు ప్రభుత్వం పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్న అచ్చెన్నాయుడు.ఆ ఘటనపై అప్పట్లో స్పందించారా.? పెద్ద దయ్యం లాగా నిరసన చేస్తే ఇప్పుడు హడావిడి చేస్తున్నావు అంటూ అచ్చం నాయుడు పై అప్పలరాజు సెటైర్లు వేశారు.ఏది ఏమైనా రుయా ఆసుపత్రి ఘటన పొరపాటున.జరగటం దురదృష్టకరమని దానికి ప్రతిపక్షాలు హడావిడి చేస్తున్నట్లు మంత్రి అప్పలరాజు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

#Appalaraju #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు