లోకేష్ కి ఛాలెంజ్ విసిరిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..!!

Minister Anil Kumar Yadav Throws Challenge To Lokesh

టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల పట్ల.వైసీపీ ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ప్రతి స్పందిస్తున్నారు.పట్టాభి చేసిన వ్యాఖ్యలతో.ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటంతో పాటు ఏకంగా పట్టాభి ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది.ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి ఏకవచనంతో పరుష పదజాలంతో బూతులు తిట్టడంతో.ఈ దాడులు జరిగాయి.

 Minister Anil Kumar Yadav Throws Challenge To Lokesh-TeluguStop.com

ఇటువంటి తరుణంలో తాజా ఘటనలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి.

ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.రేయ్ అని… సోషల్ మీడియా లో నారా లోకేష్ జగన్ పై పెట్టిన పోస్ట్.

 Minister Anil Kumar Yadav Throws Challenge To Lokesh-లోకేష్ కి ఛాలెంజ్ విసిరిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పట్ల కూడా స్పందిస్తూ… నారా లోకేష్ కి “దమ్ముంటే చూసుకుందాం రా”… పప్పుగా అంటూ.ఛాలెంజ్ విసిరారు.

సీఎం జగన్ ని తీడితే ఊరుకుంటామా.? అంటూ అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.నిజంగా నువ్వు రాయలసీమలో పుట్టి ఉంటే చిత్తూరు జిల్లాలో… పుడితే .రారా చూసుకుందామని నారా లోకేష్ కి.మంత్రి అనిల్ చాలెంజ్ విసిరారు.నెల్లూరులోనే వారం రోజులు ఉంటా.

ఎప్పుడైనా రావచ్చు.ఎవరు వచ్చినా సరే… అవసరమైతే కాన్వాయ్ పక్కన పెట్టి వస్తా… చూసుకుందాం… లోకిగా రా అంటూ… మండిపడ్డారు.

ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా అనిల్ సీరియస్ అయ్యారు.సీఎం జగన్ ని దారుణంగా తిట్టిన విషయం పవన్ కళ్యాణ్ కి తెలియదా అని ప్రశ్నించారు.నిజంగా జగన్ ఫ్యాక్షనిస్టు అయితే మీరు రాష్ట్రంలో ఉండగలరా.?? బతికి బట్ట గలరా…?? అని సీరియస్ డైలాగులు వేశారు.వైసిపి కార్యకర్తలు జోలికొస్తే చర్మం వలిచేస్తం .నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కి వార్నింగ్ ఇచ్చారు.

#Pawan Kalyan #AnilKumar #AnilKumar #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube