మంత్రి అనిల్ కు కరోనా పరీక్షలు,కారణం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భారత్ లో కూడా విజృంభిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకూ ఈ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం తో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు.

 Anil Kumar Yadav, Minister, Ap, Corona Tests, Self Quarantine-TeluguStop.com

ఎక్కువ భాగం ఈ కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకె పరిస్థితులు ఎక్కువగా ఉండడం తో అధికారులు మరింత అప్రమత్తమై చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో లోనే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కూడా కరోనా పరీక్షలు జరిపినట్లు తెలుస్తుంది.

అయితే ఇంతకీ మంత్రిగారికి కరోనా పరీక్షలు జరపడానికి ఒక కారణం ఉందట.
అదే ఇటీవల ఆయన కలిసిన ఒక డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడం తో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంత్రి అనిల్ క్వారంటైన్ లోకి వెళ్లగా, తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది.

అయితే ఆయన రక్త పరీక్షల్లో నెగిటివ్ అని రిపోర్ట్ రావడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ నెల 5న నెల్లూరుకు చెందిన ఓ వైద్యునికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

అయితే ఇటీవల ఆయన తన హాస్పటల్ ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్‌ ను కూడా ఆహ్వానించడం తో మంత్రి గారు ఈ కార్యక్రమానికి హాజరు అయినట్లు తెలుస్తుంది.అయితే తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ రావడం తో అతనితో దగ్గరగా కాంటాక్ట్ అయిన వారిలో ఆందోళన మొదలైంది.

Telugu Corona, Quarantine-

ఈ క్రమంలోనే మంత్రి గారు కూడా ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి ఆదివారం తన రక్త నమూన పంపించగా తాజాగా రిపోర్ట్ వచ్చింది.ఆ రిపోర్ట్ లో మంత్రిగారికి కరోనా నెగిటివ్ అని తేలడం తో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.దీంతో ఇక మంత్రి గారు తన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.మరోవైపు జిల్లాలోని పలువురు డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో వారు కూడా స్వీయ గృహ నిర్భందంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube