అంత ఖర్మ పట్టలేదు అంటున్న మంత్రి అఖిల ప్రియ !  

  • గత కొద్దిరోజుగా పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో ఇమడలేకపోతున్నారు… ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా… ఆమె జనసేన పార్టీలోకి జంప్ చేయడం ఖాయమే అన్నట్టుగా కధనాలు కూడా వినిపించాయి. ఈ వార్తల పై ఆమె స్పందనచారు.ఈ మేరకు కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని మరీ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మొద్దని ప్రజలను కోరారు.

  • Minister Akhila Priya Was Given A Description Of Party Change-

    Minister Akhila Priya Was Given A Description Of Party Change

  • అంతే కాకుండా… జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, విజయాన్ని చంద్రబాబుకు కానుగా ఇస్తానని మంత్రి తెలిపారు.