అలిగిన మంత్రిగారు ...జనసేనవైపు వెళ్ళిపోతున్నారా ...?     2019-01-10   14:34:45  IST  Sai Mallula

రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రిగారు వైసీపీ నుంచి ఎమ్యెల్యేగా గెలిచి టీడీపీ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా… ఆ పార్టీలో చేరి మంత్రి అయ్యారు. అయితే అధికార పార్టీలో ఆమెకు ప్రాధాన్యం కలిగిన శాఖే దక్కినా… ఆమె నిత్యం అసంతృప్తికి గురవ్వుతూ… అలక చెంది ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసేస్తుంటారు.

Minister Akhila Priya To Join In Janasena Party-Janasena Party Pawan Kalyan TDP

Minister Akhila Priya To Join In Janasena Party

అయితే…ఈమె వ్యవహాంరంలో గట్టిగా మందలించలేక .. సమర్ధించలేక టీడీపీ అదిఎంత చంద్రబాబు సతమతం అవుతూ ఉంటున్నాడు. అయితే ఆమె ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనలోకి చేరాలని చూస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఆమె మరెవరో కాదు. దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ.

Minister Akhila Priya To Join In Janasena Party-Janasena Party Pawan Kalyan TDP

టీడీపీలో ఆమె చేరిన దగ్గర నుంచీ వివాదాస్పదంగానే ఉన్నారు. సాక్షాత్తు సీఎం ముఖ్యమంత్రి కర్నూల్ వచ్చి సభ పెడితే ఆ సభకు కూడా రాలేదు అఖిలప్రియ. అయితే ప్రభుత్వ పెద్దలు పార్టీ వర్గాలు కూడా ఆమె కు నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించడంతో అనివార్య పరిస్థితులలో రాజకీయాలలోకి వచ్చారు ఆమె. ఉపఎన్నికలలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు వైసీపీని వీడి టీడీపీ చేరారు. 2017లో ఆయన అకాల మరణం చెందడంతో ఆవిడకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది టీడీపీ ప్రభుత్వం. నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉపఎన్నికలో అఖిలప్రియ తమ్ముడు బ్రహ్మానందరెడ్డి కూడా గెలుపొందారు.

అయితే ఆమె టీడీపీలో ఇమడలేకపోతున్నారు.. గతంలో భూమా దంపతులు ప్రజారాజ్యంలో పని చేశారు. ఇప్పుడు ఆ చనువుతో పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళబోతున్నారు అనే వార్తలు ఇప్పడు జోరందుకున్నాయి. ఆమె పార్టీ మారడానికి ఇటీవల ఆళ్లగడ్డలో ఇటీవల పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అనుచరుల ఇళ్లలోకి అర్ధరాత్రిపూట పోలీసుల చొరబడి, తనిఖీలు చేశారు.

ఈ క్రమంలో తన అనుచరుల ఇళ్లపై దాడులు చేయడాన్ని అఖిలప్రియ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఈ కార్డన్ సెర్చ్ మీద స్థానిక పోలీసులను అఖిలప్రియ ప్రశ్నిస్తే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశామని చెప్పారట. దీంతో అలిగిన ఆమె ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో ఉండకూడదని… జనసేనలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా పవన్ నుంచి స్పష్టమైన క్లారిటీ రాలేనట్టు తెలుస్తోంది.