తెలంగాణాలో మినీ మేడారం జాతర.. ఆ తేదీ ఎప్పుడంటే.. !

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో మొదలవనుందట.ఆదివాసుల పండగ అని చెప్పబడే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర పేర్కొనబడుతుంది.

 Telangana, Medaram, Sammakka Saralamma, Festival, Date-TeluguStop.com

అంతే కాదు ఈ జాతరకు దేశ, విదేశాల నుండి కూడా ఎందరో భక్తులు తరలి రావడం విశేషం.

ఇకపోతే రెండేళ్లకొకసారి ఘనంగా నిర్వహించే ఈ మేడారం జాతరను వచ్చేనెల ఫిబ్రవరిలో మినీ జాతరగా నిర్వహించాలని దేవదాయ శాఖ అధికారులు, పూజారులు, ట్రస్టు కమిటీ ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారట.

వాటి వివరాలు పరిశీలిస్తే.

ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్న పూజారులు.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 24 బుధవారం రోజు గుడిశుద్ధి, పూజాకార్యక్రమాలు, ఇదే రోజు ఉదయం గ్రామ నిర్భంధన చేయనున్నారు.

ఇక 25 వ తేది గురువారం సమ్మక్క, సారాలమ్మలకు పసుపు, కుంకుమలతో అర్చన.26 వ తేది శుక్రవారం భక్తులకు అమ్మవార్ల దర్శనం.27వ తేది శనివారం అమ్మవార్ల పూజ కార్యక్రమాలతో మేడారం మినీ జాతర ముగుస్తుందట.ఇకపోతే ఈ జాతరను కేవలం మూడు రోజులకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube