రెండు రాళ్లు అతని జీవితాన్నే మార్చేశాయి …!  

Miner Tanzania Finds Rare Large Gem Stones - Telugu Gem Stones, Miner Tanzania,

అదృష్టం ఎప్పుడు ఎవరిని తలుపు పడుతుందో తెలియదు… రాసిపెట్టి ఉండాలి కానీ, కనురెప్ప మూసి తెరిచే సమయంలో వారి జాతకం మారిపోతుంది.అయితే తాజాగా ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.

 Miner Tanzania Finds Rare Large Gem Stones

ఈ సంఘటన టాంజానియా దేశంలో జరిగింది.ఓ రోజు వారి కూలీ జాక్ పాట్ కొట్టేశాడు.

అసలు అతను జాక్ పాట్ ఎలా కొట్టాడో అనుకుంటున్నారా…? చూడడానికి మామూలుగా రాళ్లలాగే ఉంటాయి కానీ, అవి అత్యంత విలువైన జాతి రత్నాలు కు సంబంధించిన రాళ్లు.దీనితో అతని తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది.
52 ఏళ్లు ఉన్న లైజర్ కు అదృష్టం వచ్చింది.కేవలం రెండే రెండు రాళ్లు అతని జీవితం మొత్తాన్ని మార్చేశాయి.

రెండు రాళ్లు అతని జీవితాన్నే మార్చేశాయి …-General-Telugu-Telugu Tollywood Photo Image

మామూలుగా తూర్పు ఆఫ్రికా వజ్రాల గనుల కు పేరు మోసింది.అక్కడి ప్రజలకు వారి వారి భూములలో దొరికే వజ్రాలను డైరెక్టుగా ప్రభుత్వానికి అమ్మి వారు సొమ్ము చేసుకోవచ్చు.

నిజానికి చాలా మంది ఇదే పనిలో జీవనం కొనసాగిస్తుంటారు.లైజర్ తన ప్రాంతంలో ఉండే ఓ గనిలో రోజు కూలీగా పని చేసేవాడు.

ఆ గని లో రోజూ తవ్వకాలు జరుపుతుంటారు.అయితే ఆ తవ్వకాల్లో భాగంగా 2 రోజుల క్రితం అతనికి రెండు పెద్ద పెద్ద రాళ్లు లభించాయి.

అవి చూడటానికి కేవలం రాళ్ల లాగే ఉన్న నిజానికి అవి వజ్రాలు.

ఆ వజ్రాలు కూడా ఎంత భారీ సైజులో ఉన్నాయంటే ఒక ఒక రాయి బరువు 9.72 కిలోలు ఉండగా మరొకటి 5.1 కిలోలు ఉన్నాయి.అయితే ఇది ముదురు వైలెట్ నీలి రంగులో ఉన్నాయి.ఇక వాటిని ప్రభుత్వానికి విక్రయించడంతో అతనికి దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌ లభించాయి.దీని విలువ భారత కరెన్సీలో 25 కోట్లగా ఉంటుంది.

ఇకపోతే ఈ వజ్రాలను టాంజానియా లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న గనులలో కనుగొన్నాడు లైజర్.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Miner Tanzania Finds Rare Large Gem Stones Related Telugu News,Photos/Pics,Images..

footer-test