మైండ్ బ్లాక్ ట్విస్టులతో.. ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు ఇవే?

సాధారణంగా సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సినిమా స్టోరీ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తర్వాత వచ్చే సీన్ ఏంటి అన్నది ప్రేక్షకుడి మదిలో మెదులుతూ ఉంటుంది.

 Mindblowing Twists In Tollywood Movies , Prashant Verma, Rao Ramesh, Carafe Kan-TeluguStop.com

ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ క్లైమాక్స్ లో ఉంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆశ్చర్య పోవటమే కాదు ఆ ట్విస్ట్ కు ఫిదా అయిపోయి ఉంటారు .చివరిలో సూపర్ ట్విస్టుతో ప్రేక్షకులను ఫిదా చేసిన సినిమాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యువ దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అ! సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులందరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది.సినిమా మొత్తం వివిధ పాత్రల నేపథ్యంలో సాగుతూ ఉంటుంది.కానీ చివర్లో అవన్నీ కాజల్ లో ఉండే స్ప్లిట్ పర్సనాలిటీ అంటూ రివీల్ చేసి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు దర్శకుడు.

ఆర్ ఎక్స్ 100 సినిమా యువతను ఎంతో ఆకర్షించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు రావు రమేష్ ని విలన్ గా ఊహించుకుంటారు.

చివర్లో అసలు కథ నడిపించింది పాయల్ రాజ్ పుత్ అని రివిల్ అవడంతో అందరూ షాక్ అవుతారు.

Telugu Climax, Vishwaksen, Tollywood, Prashant Verma, Rangasthalam, Rao Ramesh-T

చిన్న సినిమాగా వచ్చి నిజ జీవితానికి దగ్గరగా ఉండి ప్రేక్షకుల మదిని తాకింది కేరాఫ్ కంచరపాలెం సినిమా.ఇక ఈ సినిమాలో నాలుగు పాత్రలు ఉంటాయి.ఇక వాటి నేపథ్యంలోనే సినిమా సాగిపోతూ ఉంటుంది.

కానీ క్లైమాక్స్ లో ఇక ఈ సినిమాలో కనిపించిన నాలుగు పాత్రలు అన్నీ కూడా రాజు అనే వ్యక్తి జీవితంలో జరిగిన ఘటన లే  అని దర్శకుడు రివిల్ చేస్తూ ట్విస్ట్ ఇస్తాడు.

యువ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా హిట్.

ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తర్వాత ఏం జరుగుతుందనే ఆత్రుత ఉంటుంది.కాని చివరలో విలన్ ఏకంగా హీరో పక్కన మొదటి నుంచి ఉన్న ఫ్రెండ్ అని ట్విస్టు బయటపడుతుంది.

Telugu Climax, Vishwaksen, Tollywood, Prashant Verma, Rangasthalam, Rao Ramesh-T

ఒకవైపు కామెడీతో మరోవైపు సస్పెండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్న చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.డెడ్ బాడీస్ మాఫియా అనే కాన్సెప్ట్ తో  తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ ఒక రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారు అందరు.అసలు విలన్స్ ఒక సామాన్యులైన తండ్రి కూతుర్లు అన్నది చివర్లో రివీల్ అవుతుంది.

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఎవరు.నేరస్తురాలిగా ఉన్న రెజీనా కసాండ్రా నుంచి నిజాలు రాబట్టడం కోసం పోలీస్గా వచ్చిన అడవి శేష్.చివర్లో పోలీస్ కాదని అది అతను బాధితుడు అన్న ట్విస్టు బయటపడుతుంది.

Telugu Climax, Vishwaksen, Tollywood, Prashant Verma, Rangasthalam, Rao Ramesh-T

రామ్చరణ్ లాంటి స్టార్ హీరో నటించిన రంగస్థలం సినిమాలో ఊహించని ట్విస్ట్ కూడా బయటపడుతుంది.చిట్టిబాబు అన్నను చంపిన వాడు ఎవరో కాదు ఊరి ప్రెసిడెంట్ అని అందరూ అనుకుంటారు.కానీ ఆ తర్వాత ఆ నేరానికి పాల్పడింది ప్రకాష్ రాజు అన్న విషయాన్ని చివర్లో రిలీజ్ చేస్తారు చిట్టి బాబు.దీంతో అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది.

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కూడా చివరలో ఊహించని ట్విస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది.ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని విడిచి పెట్టడానికి సిద్ధమైన హీరో ఎందుకు అలా చేస్తాడు అన్నది ప్రేక్షకులకు అర్థం కాదు.

చివర్లో హీరో అలా చేయడానికి కారణం ఏంటి అన్నది క్లైమాక్స్ లో రివీల్ చేశాడు దర్శకుడు.ఇక ఈ ట్విస్టుతో ప్రేక్షకులు అందరూ నోరెళ్లబెడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube