ఇండియాలోనే అత్యంత అందమైన ప్రేమ కథ ఈ హీరోహీరోయిన్ ది

Mind Blowing Love Story Of Sunil Dutt And Nargis

సంజయ్ దత్ బాలీవుడ్ టాప్ హీరో.ఎన్నో హిట్ సినిమాలతో అద్భుత నటుడిగా పేరుపొందాడు.

 Mind Blowing Love Story Of Sunil Dutt And Nargis-TeluguStop.com

కొన్ని వివాదాల్లో చిక్కుకుని జైలు జీవితాన్ని గడిపాడు ఈ బాలీవుడ్ బడా హీరో.ఆయన గురించి కాసేపు పక్కన పెడితే ఆయన తల్లిదండ్రులు కూడా సినిమా నటులే.

అంతేకాదు.వారిద్దరూ అప్పట్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

 Mind Blowing Love Story Of Sunil Dutt And Nargis-ఇండియాలోనే అత్యంత అందమైన ప్రేమ కథ ఈ హీరోహీరోయిన్ ది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ సంజయ్ దత్ తల్లిదండ్రుల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సునీల్ దత్ అప్పుడప్పుడే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

నటి నర్గీస్ ను ఓ సినిమా ప్రీమియర్ షోలో తొలిసారి చూశాడు.అప్పటికే ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్.

ఆమెను చూసిన మొదటిసారే ప్రేమలో పడ్డాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి మదర్ ఇండియా సినిమాలో కలిసి నటించారు.

అప్పుడే వీరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది.మదర్ ఇండియా సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సినిమాలో నర్గీస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.ఇండియా బెస్ట్ ప‌ర్ఫార్మెన్సెస్‌లో ఒకటిగా నర్గీస్ నటనను చెప్తారు.

సునీల్ దత్ కూడా ఈ సినిమాలో చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు.అప్పటికే రాజ్ కపూర్ తో ప్రేమాయణం నడిపి ఇబ్బందులు పడ్డ నర్గీస్.

అప్పుడప్పుడే ఆ బ్యాడ్ మెమరీస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది.అప్పుడే సునీల్ తో కలిసి మదర్ ఇండియా సినిమా చేసింది.ఆ సమయంలో సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది.తన ప్రాణాలను పణంగా పెట్టి నర్గీస్ ను కాపాడాడు సునీల్.ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.

Telugu Bollywood, Love Story, Mother India, Nargis, Raj Kapoor, Sanjay Dutt, Sunil Dutt-Telugu Stop Exclusive Top Stories

ఆ ఘ‌ట‌న త‌ర్వాత సునీల్ ఆమెకు మంచి మిత్రుడు అయ్యాడు.ఒక‌సారి సునీల్ సోద‌రికి స‌ర్జ‌రీ జరగాల్సి ఉంది.తనను నర్గీస్ హాస్పిటల్ కు తీసుకెళ్లి.సర్జరీ అయ్యేవరకు అక్కడే ఉన్నది.ఒక‌రోజు న‌ర్గీస్‌ను ఇంటి దగ్గర దింపి రావడానికి వెళ్లాడు సునీల్.అదే సమయంలో తనకు ప్రపోజ్ చేయాలి అనుకున్నాడు.తను కాదంటే సినిమాలను వదిలేసి తన సొంతూరుకు వెళ్లిపోవాలి అనుకున్నాడు.కానీ తను ఓకే చెప్పింది.1958లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.23 ఏళ్ల‌పాటు వారు అన్యోన్యంగా కలిసి ఉన్నారు.వారికి సంజ‌య్‌, న‌మ్ర‌త, ప్రియ‌ అనే పిల్లలు పుట్టారు.

కానీ పేన్‌క్రియాటిక్ కేన్స‌ర్‌కు గురైన న‌ర్గీస్ 52 ఏళ్ల వ‌య‌సులో చనిపోయింది.సునీల్ 2005లో చనిపోయాడు.

#Raj Kapoor #Love Story #Sanjay Dutt #Sunil Dutt #Nargis

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube