అర్జున్‌పై ఆరోపణలు చేసిన శృతి గురించి మైండ్‌ బ్లోయింగ్‌ విషయం  

సౌత్‌ స్టార్‌ హీరో అర్జున్‌పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ మీటూ ఉద్యమంలో భాగంగా లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అర్జున్‌ తనను విస్మయ చిత్రం షూటింగ్‌ సమయంలో దర్శకుడు చెప్పకుండానే దగ్గరకు తీసుకుని లైంగికంగా వేదించాడు అంటూ ఆరోపణలు చేసింది. అయితే శృతి చేసిన ఆరోపణలను అర్జున్‌ కొట్టి పారేశాడు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన శృతి వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఈ సమయంలోనే శృతి కూడా అర్జున్‌ పై లైంగిక దాడి కేసును పెట్టింది.

Mind Blowing Facts About Sruthi Hariharan-

Mind Blowing Facts About Sruthi Hariharan

బెంగళూరులోని కబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో శృతి కేసు నమోదు చేసింది. ఈ సందర్బంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శృతి తాను మిస్‌ కాదు మిసెస్‌ అంటూ చెప్పుకుంది. పెళ్లి అయ్యిందని, తన భర్త రామ్‌ కుమార్‌ అంటూ పేర్కొంది. చాలా ఏళ్లుగా డాన్స్‌ మాస్టర్‌ రామ్‌ కుమార్‌, తాను ప్రేమించుకున్నాం, ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని శృతి సంచలన విషయాన్ని బయట పెట్టింది. హీరోయిన్‌ పెళ్లి విషయాన్ని దాచి పెట్టడంతో సినీ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

Mind Blowing Facts About Sruthi Hariharan-

శృతిహరిహరన్‌ పెళ్లి అయినా కూడా ఇంతగా లైంగిక వేదింపుల కేసును లాగేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు అంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్‌ ను ఆమె బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. హీరోయిన్‌గా పెద్దగా ఆఫర్లు లేని శృతి ఇలా అయినా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లుగా కొందరు గుసగుసలాడుతున్నారు.

దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న నేపథ్యంలో శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణలు సౌత్‌లో సంచలనం సృష్టించాయి. నిజంగానే అర్జున్‌ అటువంటి వ్యక్తా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం అర్జున్‌ అటువంటి వ్యక్తి కాదు అంటూ చెబుతున్నారు. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.