చిరుతకు మైండ్ బ్లాక్.. అడవి పంది దెబ్బకు పరుగోపరుగు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..!

శరవేగంగా పరుగులు పెడుతూ అత్యంత బలంతో ఢీకొట్టి ప్రత్యర్థి జంతువులను చంపే సత్తా అడవి పందులకు ఉంటుంది.వీటికి ముందు భాగంలో ఉండే 2 పదునైన పళ్లు శత్రువులను చీల్చి చెండాడటానికి ఉపయోగపడతాయి.

 Mind Block For Leopard. Wild Boar Runs For Blow Laughing Video Tiger, Fight, La-TeluguStop.com

అందుకే వీటి జోలికి చాలా మాంసాహార జంతువులు వెళ్ళవు.పెద్ద సింహాలు, పులులు తప్ప వీటిని వేటాడడానికి మిగతా జంతువులన్నీ భయపడిపోతాయి.

అయితే ఇలాంటి ఓ అడవి పందితో తాజాగా ఒక చిరుత పులి కయ్యానికి కాలు దువ్వింది.దాన్ని చంపేసి ఎంచక్కా తినేద్దాం అనుకుంది.

కానీ అడవి పంది ఎదురు తిరగడంతో చిరుతకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది.దాని దెబ్బకు పులి పరుగు లంకించుకుంది.

దీనికి సంబంధించిన వీడియోని ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

వైరల్ అయిన వీడియోలో ఓ భారీ అడవి పందిపై అటాక్ చేసేందుకు ఆఫ్రికన్ చిరుతపులి యత్నించింది.

అన్ని జంతువులను వేటాడినట్లుగానే ఈ చిరుత అడవిపందిని వెంటాడింది.దాంతో ప్రాణభయంతో ఆ అడవి పంది శర వేగంగా పరుగు పెట్టింది.

అయితే ఈ అడవి పంది చిరుత కు ఝలక్ ఇవ్వడానికే అలా పరుగులు పెట్టిందని తర్వాత అర్థమయింది.ఎందుకంటే ఆ పంది మొదట్లో బాగా స్పీడుగా ఉరికి… ఆ తర్వాత ఒక్కసారిగా బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది.

దాంతో చిరుత పులి అడివి పంది ముందుకొచ్చి ఆగిపోవాల్సి వచ్చింది.అలా కరెక్ట్ గా తన కోర దంతాలకు ముందుగా చిరుత నిలిచి అత్యంత డేంజరస్ పరిస్థితుల్లో చిక్కుకుపోయింది.దాడికి అనువుగా ఉండటంతో వెంటనే అడవి పంది చిరుతను తన కొమ్ములతో కుమ్మేసింది.దాని పళ్ళు తన పొట్టలో ఎక్కడ గుచ్చుకుపోతాయేమోనని భయంతో చిరుత అక్కడినుంచి క్షణాల్లోనే ఉడాయించింది.“నన్ను విడిచి పెట్టవే తల్లి” అన్నట్లు ఆ పులి ఫేస్ ఎక్స్‌ప్రెష‌న్ పెట్టింది.మొత్తానికి ఇది తన ప్రాణాలను కాపాడుకొని బతికిపోయింది.

ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.అడవి పందితో పెట్టుకుంటే ఇదే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.అయితే ఈ ఘటన ఏ అభయారణ్యంలో జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube