రంజాన్ ప్రార్ధనలు ఇంట్లోనే చేయండి.. ఎం.ఐ.ఎం చీఫ్ అసదుద్దీన్..!

కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలో 10 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం.మే 12 నుండి 21 తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.

 Mim Chief Asaduddin Ramadan Prayers At Home-TeluguStop.com

అయితే ఈ లాక్ డౌన్ 10 రోజులే ఉంటుందా కొనసాగుతుందా అన్నది 20న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారు.కేసులు తగ్గుముఖం పట్టిన దాన్ని బట్టి లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు.

ఇక ఇలాంటి టైంలో పండుగలు జరుపుకునే అవకాశం లేదు.

 Mim Chief Asaduddin Ramadan Prayers At Home-రంజాన్ ప్రార్ధనలు ఇంట్లోనే చేయండి.. ఎం.ఐ.ఎం చీఫ్ అసదుద్దీన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నెల 13న రంజాన్ పండుగను ముస్లీం సోదరులు ఇంట్లోనే జరుపుకోవాలని చెప్పారు ఎం.ఐ.ఎం చీఫ్ అసదుద్దీన్.కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని.లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే రంజాన్ ప్రార్ధనలు చేసుకోవాలని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.రంజాన్ కు సంబందించిన షాపింగ్స్ తో హైదరాబాద్ ఓల్డ్ సిటీ కళకళలాడుతుంది.బుధవారం లాక్ డౌన్ ఉన్నా సరే కొన్నిచోట్ల రంజాన్ సంబందించిన షాపింగ్ జరిగినట్టు తెలుస్తుంది.

లాక్ డౌన్ తొలిరోజు కాబట్టి పోలీసులు కూడా ఈరోజు వరకు వదిలేశారు.కాని రేపటి నుండి లాక్ డౌన్ ను కఠినంగా ఉండేలా చేయాలని చూస్తున్నారు.

 ఇప్పటికే ఇతర రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించగా తెలంగాణా కూడా 10 రోజుల లాక్ డౌన్ విధించి కరోనా కేసులను నియంత్రించాలని చూస్తుంది.

#Ramadan #Telanga State #Home #Corona Lockdown #Chief Asaduddin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు