కాబూల్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు...మత గురువు మృతి  

Millitents Attack In Kabul-

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం లు ‘రోజా’ నిర్వహిస్తూ బిజీ గా ఉంటున్నారు.అలాంటి సమయాన్ని అదునుగా చూసుకొని ఆఫ్ఘానిస్తాన్ లో ఉగ్రవాదులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో ఉన్న ఒక మసీదు ని టార్గెట్ గా చేసుకొని బాంబు పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో మత గురువు(ఇమామ్) మృతి చెందగా, మరో 16 మంది గాయపడినట్లు తెలుస్తుంది.శుక్రవారం ప్రార్ధనల కోసం మసీదుకు వచ్చిన సమయంలో ఈ పేలుడు సంభవించింది అని అధికారులు తెలిపారు..

Millitents Attack In Kabul--Millitents Attack In Kabul-

అయితే ప్రార్థనల కోసం మత గురువు ఉపయోగించే మైక్రోఫోన్‌లో ఈ బాంబును అమర్చినట్లు అధికారుల దర్యప్తు లో తేలింది.అయితే ఇప్పటివరకు ఈ పేలుడు మేమే భాద్యులం అంటూ ఇంతవరకూ ఏ అగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు.అయితే తరచూ ఐసిస్,తాలిబన్లు ఎక్కువగా అక్కడ దాడులకు పాల్పడతారు అన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అసలు ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు అన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.