డాలర్ డ్రీమ్స్: అమెరికన్లంతా కోటీశ్వరులు కాదు.. అడుక్కుతినేవారు వున్నారు, రోచెస్టర్ సర్వేలో సంచలన విషయాలు

అమెరికా.శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.

 Millions Of Workers In The Us Cant Even Afford Food And Rent, Dollars In America-TeluguStop.com

అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.

ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.ఇందులో భారతీయులు సైతం వున్నారు.

అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.

అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల.

అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.అమెరికాలో డాలర్లు సంపాదించి ద‌ర్జాగా బ‌త‌కొచ్చు.కాలు మీద కాలేసుకుని హ్యాపీగా జీవితాన్ని గడిపేయొచ్చు అనుకున్న వారికి భ్రమలు తొలగించేలా ఒక సర్వే వెలుగులోకి వచ్చింది.అక్క‌డి ఆర్థిక మేధావులు అమెరికా అనే మేడిపండును పొట్ట‌విప్పి చూపించారు.ఉద్యోగం చేస్తున్న స‌గ‌టు అమెరిక‌న్ల జీవితాలు ఎంత దుర్భ‌రంగా ఉన్నాయో బ‌య‌ట‌పెట్టారు.

కోట్లాది అమెరిక‌న్లు కనీస అవ‌స‌రాల‌ను కూడా తీర్చుకోలేని దుస్థితిలో ఎలా బ‌తుకున్నారో చూపించారు.

ఏ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అయినా అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పాలంటే అందుకు ప్రామాణికం జీడీపీ లెక్క‌లో మ‌రోక‌టో కానే కావు.

స‌గటు మనిషి తాను బ‌త‌క‌డానికి అవ‌స‌ర‌మైన కూడు, గూడు, గుడ్డ, వైద్యం వంటి కనీస‌ ప్రాథ‌మిక అవ‌స‌రాల‌ను తీర్చుకోగ‌లుగుతున్నాడా అన్నదే ముఖ్యం.కానీ అమెరికాలో అది జ‌ర‌గ‌డం లేదంటున్నారు అక్క‌డి ఆర్థిక నిపుణులు.

ఇందుకు సంబంధించిన ఆధారాలు లెక్క‌ల‌తో స‌హా ముందుంచారు.న్యూయార్క్‌లోని రోచెస్ట‌ర్‌ను ఓ అంచ‌నాగా తీసుకుని.

వాస్తవ పరిస్ధితిని కళ్లకు కట్టినట్లు చూపించారు.

రోచెస్ట‌ర్‌లో ఒక సాధార‌ణ‌ వ్య‌క్తి త‌న ప్రాథ‌మిక అవ‌స‌రాల‌ను తీర్చుకుని జీవించాలంటే.

ఏడాదికి కనీసం అతడు $30,000 సంపాదించాలి.ఇదే స‌మ‌యంలో అమెరికాలోనే అత్య‌ధిక లివింగ్ కాస్ట్ ఉన్న‌ శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో అయితే ఈ ఖ‌ర్చు $47,587 ఉండ‌గా.

అత్య‌ల్ప లివింగ్ కాస్ట్ ఉన్న బెక్లెలో $28,200 అని ఓ అంచ‌నా.అలా చూసుకున్నా.ఒక సగటు పౌరుడు బ‌త‌కాలంటే $30,000 అవ‌స‌రం.అయితే అమెరికాలో ఏకంగా 27 మిలియ‌న్ల మంది బ‌త‌క‌డానికి అవ‌స‌ర‌మైన ఆ $30,000 సంపాదించలేక జీవితాన్ని గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Telugu Economics, Bureaulabor, Dollars America, Afd, York, Rochester, Science-Te

ఈ 27 మిలియన్ల మంది కార్మికులలో రిటైల్, అతిథ్య రంగాల్లో పనిచేసేవారే అధిక‌మ‌ని అంచ‌నా.అమెరికాలో అధిక ఉద్యోగాలు క‌ల్పించేవి అలాగే అత్యల్ప సగటు వేతనాలను అందించేవి కూడా ఈ రెండు రంగాలే.ఉదాహ‌ర‌ణ‌కు క్యాషియర్‌ల సగటు జీతం అక్క‌డ $ 28,850.అమెరికాలో మొత్తం 5 మిలియన్ల క్యాషియర్లు ప‌నిచేస్తుండ‌గా.ఇందులో 2.5 మిలియన్ల మంది అంత‌కంటే తక్కువ సంపాదిస్తున్నారు.రిటైల్ రంగంలో దాదాపు 75% మంది కార్మికులు – దాదాపు 1.8 మిలియన్ల మంది వార్షిక ఆదాయం ఏడాదికి $ 27,080 కంటే తక్కువే.ఇక వెయిట‌ర్ల సగటు ఆదాయం $ 23,740గా ఉంది.

2021 బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం 2019 లో అమెరికాలో 6.3 మిలియన్ల మంది కార్మికులు దారిద్ర‌రేఖ‌కు దిగువ ఉన్న‌ట్టుగా గుర్తించారు.ఆయా కుటుంబాలకు చెందిన వ్య‌క్తులు క‌నీసం $12,880 కూడా సంపాదించుకోలేక‌పోతున్నార‌ని వెల్ల‌డైంది.

అందుకే డాల‌ర్ డ్రీమ్స్ అంద‌రికీ కావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube