ఆ బీచ్ ‌కు లక్షలాది సంఖ్యలో వలస వచ్చిన తాబేళ్లు..!

మామూలుగా కొన్ని రకాల జంతువులు చలికాలంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం మనం గమనిస్తూ ఉంటాం.వేరే దేశాల నుంచి భారతదేశానికి రావడం మనం అనేక సార్లు గమనించి ఉండే ఉంటాము.

 Millions Of Turtles Migrated To That Beach, Turtles, Beach, Reproduction, Male T-TeluguStop.com

అయితే అలా వచ్చిన కొన్ని రకాల జంతువులు ఆ సీజన్ ముగియగానే వారి సొంత దేశాలకు తిరిగి ప్రయాణం చేస్తాయి.ఇదే ప్రక్రియకు ఆలివ్ రైడ్లీ అనే జాతికి చెందిన తాబేళ్లు వాటి సంతానోత్పత్తి కోసం వలసలు వస్తూ ఉంటాయి.

దీంతో తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపర జిల్లాలో ఉన్న గ‌హిర్‌మ‌త బీచ్‌ దగ్గర ఏకంగా కొన్ని లక్షల సంఖ్యలో తాబేళ్లు దర్శనమిచ్చాయి.దీంతో ఆ ప్రదేశం చూడడానికి ఎంతో రమణీయంగా మారింది.

సముద్రపు తాబేళ్లు జాతికి చెందినవి ఈ ఆలివ్ రైడ్లీ తాబేళ్లు.ఇవి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ఆ బీచ్ కు చేరుకొని అక్కడ ఆడ,మగ కలయిక ద్వారా వాటి సంతానోత్పత్తిని పెంపొందిస్తాయి.

అలా జరిగిన తర్వాత అక్కడి నుంచి మగ తాబేళ్లు వెళ్లిపోతాయి.ఆ తర్వాత అక్కడ ఉన్న ఆడ తాబేళ్లు వాటికి సంబంధించిన గుడ్ల కోసం గూళ్లు ఏర్పాటు చేసుకొని అవి కూడా వెళ్లిపోతాయి.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ గుడ్ల నుంచి పిల్ల తాబేళ్లు వేల సంఖ్యలో బయటికి వస్తాయి.ప్రస్తుతం ఈ బీచ్ లో కొన్ని లక్షల సంఖ్యలో తాబేలు కనిపిస్తున్న సందర్భంగా చుట్టుపక్కల ఉన్న జాలర్లను చేపలు పట్టడాన్ని అధికారులని నిషేధించారు.

అయితే ఇందుకు సంబంధించి కారణం లేకపోలేదు.

జాలర్లు చేపల వేటకు వెళ్లిన సమయంలో తాబేలు వారి వలల కు చిక్కి చనిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.కాకపోతే ఒక్కో తాబేలు ఏకంగా 100 గుడ్లను పైగా పెడతాయి.

ఇందులో ప్రతి గుడ్డు నుంచి పిల్లలు రావు.కొన్ని కోడిగుడ్లు మధ్యలోనే నిర్వీర్యం అవుతాయి.

మరికొన్ని సముద్రపు అలల తాకిడికి గురి కావడంతో అవి కూడా నీటిలో కొట్టుకొని పోతాయి.మిగిలిన కొద్దిపాటి గుడ్ల లలో నుంచి మాత్రమే బయటికి వస్తాయి.

ఇకపోతే గత సంవత్సరంలో ఏకంగా ఏడు లక్షలకు పైగా తాబేళ్లు ఆ బీచ్ కు వచ్చినట్లు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube