ఏపీలో ఇన్ని లక్షల బోగస్ ఓట్లు నమోదయ్యాయా ...?

ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం సర్వ సాధారణం.అయితే … లక్షల కొద్దీ… ఓట్లు బోగస్ గా నమోదయ్యాయి.

 Millions Of Fake Votes Recorded In Ap-TeluguStop.com

అనే నిజం ఇప్పుడు సంచలనం రేపుతోంది.అయితే ఈ బోగస్ ఓట్ల వ్యవహారం ఆషామాషీగా కాదు… లెక్కలతో సహా బయటపెట్టారు ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ బృందం.

ఓ ప్రత్యేక సాప్ట్ వేర్ ద్వారా ఓటర్ల జాబితాలను అధ్యయనం చేసి అనేక విషయాలను వెల్లడించింది.ఈ టీమ్ ప్రతినిధులు తుమ్మల లోకేశ్వరరెడ్డి, నలివెల సురేష్‌కుమార్‌రెడ్డిలు మాట్లాడుతూ….

ఈ నెల 11న ప్రచురితమై ఉన్నట్లు చెప్పారు.రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు ఉన్నవారు సుమారు 20.07 లక్షల మంది ఉన్నారని ఆ సంస్థ సభ్యులు చెప్పారు.

నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్‌ అయ్యాయని తెలిపారు.అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు.వీటిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేశారు.సోమవారం ఎన్నికల అధికారిని వాస్ట్‌ ప్రతినిధులు కలిసి అక్రమ ఓట్ల వివరాలతో రూపొందించిన నివేదిక అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube