బిడెన్ కు షాక్ ఇచ్చిన 1.5 కోట్ల మంది అమెరికన్స్...

కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో అమెరికా బిగ్ సక్సెస్ అయ్యిందని, అమెరికన్స్ అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడంలో మొగ్గు చూపడం వలెనే ఇది సాధ్యమయ్యిందని.వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో అమెరికన్స్ అందరికి చిన్నా పెద్దా తేడా లేకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని చెప్పుకొచ్చిన బిడెన్ కు అమెరికా ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు.100 రోజులు పూర్తి చేసుకునే లోగా వ్యాక్సినేషన్ లో టార్గెట్ పెట్టుకున్న బిడెన్ ఫస్ట్ డోస్ వరకూ శ్రద్ద చూపారని కానీ…

 Nearly 15million Americans Missed Second Covid Dose Vaccine, 15million America-TeluguStop.com

వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసుకోవడానికి మాత్రం చాలా మంది ముందుకు రావడం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తన నివేదికలో వెల్లడించింది.దాదాపు 1.5 కోట్ల మందికి పైగానే అమెరికన్స్ సెకండ్ డోస్ వేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపింది. ఫైజర్ టీకా తీసుకున్న వారు సరిగ్గా మూడు వారాల తరువాత సెకండ్ డోస్ తీసుకోవాలని తప్పకుండ 42 రోజుల తరువాత సెకండ్ డోస్ తీసుకుంటేనే ఉపయోగం ఉంటుందని తెలిపింది.అయితే

Telugu Americans, Corona Vaacine, Joe Biden, Americanscovid-Telugu NRI

42 రోజలు దాటినా సరే మొదటి డోస్ తీసుకున్న వాళ్ళు రెండవ డోస్ తీసుకోవడానికి రావడం లేదని అలా వారం వరకూ చూసి అలాంటి వారిని సెకండ్ డోస్ తీసుకొని వారిగా పరిగణిస్తున్నామని అలా వచ్చిన వారిలో దాదాపు 1.5 కోట్లు మంది ఉన్నారని తెలిపారు.అయితే ఎందుకు రెండవ డోస్ తీసుకోవడం లేదు అనే విషయానికి కూడా అమెరికా ప్రజలు క్లారిటీ ఇచ్చారట రెండవ డోస్ తీసుకోవడం వలన సైడ్ ఎఫ్ఫెక్ట్ లు వస్తున్నాయనే పుకార్ల వలెనే వారు సెకండ్ డోస్ విషయంలో అనాసక్తిగా ఉన్నారని కూడా సంస్థ తెలిపింది.అయితే ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారు రెండవ డోస్ తీసుకోకపోయినా మరలా కరోనా వచ్చే అవకాశాలు చలాతక్కువగా ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube