జాగ్రత్త : మిల్లెట్స్ తో ప్రయాణిస్తున్న ఎన్నారై అరెస్టు!

హైదరాబాద్ మారుతినగర్ కి చెందిన సంతోష్ రెడ్డి(37) అనే వ్యక్తి గత కొంతకాలంగా దుబాయ్ లోని అబుదాబిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.గతవారంలో ఇండియా వెళ్లి తిరిగివస్తూ తనతో చిరుధాన్యాలను తీసుకొనివెళ్ళాడు.

 Millets Travel Carrying Prohihited Dubai Hyderabad Held-TeluguStop.com

దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో లగేజ్ చెకింగ్ లో ఎయిర్ పోర్ట్ అధికారులు అక్కడ నిషిద్ధమైన చిరుధాన్యాలను(కొర్రలు,అండు కొర్రలు, సామలు, ఉధలు, అరికెలు) గుర్తించి సంతోష్ ని అరెస్ట్ చేసారు.

అతనికి చిరుధాన్యాలు నిషిద్ధం అని తెలియక తీసుకొనివెళ్ళాడు అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు .సంతోష్ కుటుంబ సభ్యులు అతని బెయిల్ కోసం ఇండియన్ ఎంబసీ వారిని సంప్రదిస్తున్నారు.సంతోష్‌రెడ్డి విడుదలకు సహకరించాలని ఆయన భార్య అనిత అబుదాబిలోని భారత ఎంబసీ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

దుబాయ్ లో నిషిద్ధ పదార్ధాలను ఇతర దేశాల నుంచి తీసుకునికి వస్తే ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేసి.4 సంవత్సరాల జైలు శిక్ష విధించి., శిక్ష పూర్తవ్వగానే వారిని ఆ దేశం నుంచి వెనక్కి పంపిస్తారు.గతంలో కూడా గసగసాలు తెచ్చారని ఒకరిని, కూరగాయల విత్తనాల్ని తెచ్చారని మరొకరిని స్మగ్లింగ్ కేసు నమోదు చేసి 4 ఏళ్ళ జైలు శిక్ష విధించారు.

పచ్చళ్లు,పప్పు దినుసులు ,మాంసాహార పదార్ధాలు,కరివేపాకు,గసగసాలు ,ఎండు కొబ్బరి ,కూరగాయల విత్తనాలు,డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా తీసుకెళ్లే మందులపై నిషేధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు.మీరు విదేశాలకు ప్రయాణించేటపుడు ఆయా దేశాలలో నిషేధించిన పదార్ధాలను ముందుగానే తెలుసుకొని తీసుకొని వెళ్లకుండా జాగ్రత్త పడటం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube