ఆ నిర్ణయంతో తమన్నా స్టేజ్‌ 2 కు పడిపోయిట్లేనా?

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌ లో దాదాపు పదేళ్లకు పైగా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది.హ్యాపీడేస్‌ టైం నుండి మొన్నటి వరకు తమన్నా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌.

 Tamanna In Nithin's Andhadhun Remake, Character Artist Role, Stage2, Tamanna Wit-TeluguStop.com

కాని గత రెండు మూడు ఏళ్లుగా ఆమె క్రేజ్‌ తగ్గి పోయింది.ఆమె అందం ఏమాత్రం తగ్గకున్నా ఆమెతో నటించేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపడం లేదు.

యంగ్‌ హీరోలు ఆమెను పట్టించుకోవడం లేదు.దాంతో తన యాక్టింగ్‌ కెరీర్‌ లో స్టేజ్‌ 2 ను ప్రారంభించినట్లుగా అనిపిస్తుంది.

ఇప్పటికే ఆమె చిన్న హీరోలతో నటించేందుకు ఒప్పుకుంటుంది.దానికి తోడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటించేందుకు ముందుకు వస్తుంది.

ఇలాంటి పాత్రలు చేయడం వల్ల ఈమెకు మళ్లీ సీనియర్‌ హీరల నుండి పిలుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కనుక ఖచ్చితంగా ఈమెకు స్టేజ్‌ 2 కలిసి వస్తుందని అంటున్నారు.

స్టేజ్‌ 2 లో భాగంగా నితిన్‌ సినిమాలో ఒక కీలక పాత్రను తమన్నా చేసేందుకు ఒప్పుకుంది.హిందీలో సూపర్‌ హిట్‌ అయిన అంధాదున్‌ సినిమాను తెలుగులో నితిన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు తెర పడ్డట్లయ్యింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా నభా నటేష్‌ నటిస్తుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇక అంధాదున్‌ లో కీలకమైన పాత్రలో నటించిన టబు పాత్రను తెలుగులో ఎవరు చేస్తారు అనే విషయమై చాలా రోజులుగా చర్చ జరిగింది.నయనతారను ఈ పాత్రకు ఎంపిక చేయాలనుకున్నారు.

అయితే ఆమె అయిదు కోట్లను డిమాండ్‌ చేయడంతో వెనక్కు తగ్గారు.ఆ తర్వాత టబునే తీసుకు రావాలనుకున్నారు.

కాని ఆమె నితిన్‌ ను డామినేట్‌ చేస్తుందేమో అనుకున్నారు.చివరకు తమన్నాను ఫిక్స్‌ చేశారు.

క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్ర అయినా కూడా ఆ పాత్రతో తమన్నా మంచి ప్రతిభ కనబర్చే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube