ఆ ఆలయంలో రాహువుకు పాలు పోస్తే.. నీలంగా మారతాయ్

మన పురాతణ ఆలయాల్లో సైన్స్ కు కూడా అంతు చిక్కని విచిత్రమైన విశేషాలు ఉన్నాయి.వాటిలో ఒకటి.

 Milk Turns To White While Doing Abhishekam At Tirunagalingeswara Temple, Tirunag-TeluguStop.com

తమిళనాడు కుంబకోణం లోని తిరు నాగలింగేశ్వర ఆలయం.ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాగదోషంతో బాధపడేవారు.

రాహుకాలంలో రాహువుకి పాలుపోస్తే… అవి నీలి రంగులోకి మారిపోతాయి.అవి కింద పడిన తర్వాత తెల్ల రంగులోకి వస్తాయి.

ఇక్కడ శివుడిని నాదనాదేశ్వరుడుగా, అమ్మవారిని గిరిజకుజలాంబికగా పిలుస్తారు.ఈ ఆలయం సముద్ర మట్టానికి అతి దగ్గరగా ఉండటం వల్ల… ఆలయం బయట అంతా ఇసుక మేట ఉంటుంది.

ఈ ఆలయంలో ప్రధానంగా పూజ లందుకుంటున్నది రాహువు.గర్భాలయంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉంటాడు.

నాగ దోషంతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి… రాహువుకి పాలు పోస్తే… తమ దోషం పోతుందని ప్రతీతి.ఇలా రాహు కాలంలో పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుంచి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది.

ఆ పాలు నేలపై పడినప్పుడు తెల్లగా కావడం విశేషం.ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు.

ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం.నాగమణి అని పురాణాల కథనం.

ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట.ఈ ఆలయాన్ని దర్శించు కోవడానికి శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్య మాత్రమే వెళ్ళాలి.

Milk Turns To White While Doing Abhishekam At Tirunagalingeswara Temple, Tirunagalingeswara Temple , Devotional , Lord Shiva , Milk - Telugu Devotional

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube