న్యూ లుక్ తో కనిపిస్తున్న మిలింద్‌ సోమన్..!

బాలీవుడ్ నటుడు మోడల్ అయిన మిలింద్ సోమన్ ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలవడం పరిపాటిగా మారిపోయింది.ఈ మధ్య కాలంలో ఈయన సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు.

 Milind Soman With A New Look,milind Suman, Bollywood, Goa, Police, Fir Registere-TeluguStop.com

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వృత్తి పరమైన విషయాలను అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు.ఇదే క్రమంలో తాజాగా సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేశాడు.

ఇందులో ఆయన ముఖానికి సగం వరకు ఎరుపురంగును పూసుకొని, అలాగే ముక్కు పెద్ద ముక్కు పుడక, అలాగే కళ్ళకు కాటుక తో ఉన్న విభిన్న లుక్ ను ఫోటో రూపంలో షేర్ చేశాడు.ఇందుకు సంబంధించి ఆయన ఇది మంగళవారం ప్రయాణం.

ఇది హోలీ పండుగ సమయం కాదని తనకు తెలుసు అంటూ క్యాప్షన్ జత చేశాడు.

వీటితో పాటు తాను గత కొన్ని రోజుల నుండి ముంబై సమీపంలో ఉన్న కర్జాత్ లో కొన్ని సరదా పనులు చేస్తున్నట్లు తెలిపాడు.

అంతేకాకుండా తాను ఇప్పుడు చెన్నై నగరానికి వెళ్తున్నాను అని కూడా క్యాప్షన్ లో జత చేశాడు.ఇక మిలింద్‌ సోమన్ విడుదల చేసిన ఈ ఫోటో పై నెటిజెన్స్ భారీగా స్పందిస్తున్నారు.

ఇందుకు సంబంధించి అక్షయ్ కుమార్ తాజాగా నటించిన లక్ష్మి సినిమా లోని ఫోటోలా ఉందని, ఇందులో మీరు నటించలేదు కాబట్టి ఆ క్యారెక్టర్ పై ఉన్న ఇష్టంతో ఇలాంటి ఫోటో తీసుకున్నారని ఆయన పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

అంతేకాకుండా నెటిజెన్స్ వారి స్టైల్స్ లో ఆయనపై కామెంట్ల వర్షం కురిపించారు.

అంతేకాకుండా మీ కొత్త లుక్ బాగుంది అంటూ మరి కొందరు కామెంట్ చేశారు.అలాగే తన భార్య కుడా ఈ ఫోటోపై స్పందించారు.

ఈ ఫోటో అద్భుతంగా ఉంది అంటూ తన భర్తపై ఆవిడ ప్రేమను సోషల్ మీడియా ద్వారా చాటుకున్నారు.ఇకపోతే ఇదివరకు కాలంలో ఆయన గోవా బీచ్ లో నగ్నంగా పరిగెడుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అది పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి అందరికీ తెలిసిందే.

తన 55 పుట్టినరోజు సందర్భంగా అంకిత కొన్నూర్ తీసిన ఫోటోను ఆయన సోషల్ మీడియా ద్వారా హ్యాపీ బర్త్డే టూ మీ 55 అనే క్యాప్షన్ తో షేర్ చేయగా దానిపై పెద్ద ఎత్తున విమర్శలు దారితీశాయి.దీంతో గోవా సురక్ష మంచ్ అనే సంస్థ పబ్లిక్ ప్లేస్ లో ఆయన అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతనిపై ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube