వైరల్: ట్రాన్స్‌‌జెండర్ పాత్రలో సీనియర్ నటుడు..!

ట్రాన్స్ జెండర్ అంటేనే ఎంతో చిన్నచూపు చూసే ఈ సమాజంలో ఆ జెండర్ ఎంతో శక్తివంతమైనదని ట్రాన్స్ జెండర్ లు నిరూపించుకుంటున్నారు.ట్రాన్స్ జెండర్ పాత్రలలో విభిన్న పాత్రలో నటించి ఎంతో మందిని మెప్పించారు.

 Milind Soman Represents The Third Gender, Milind Soman, Transgender, Pourashapur-TeluguStop.com

తెలుగులో కాంచన, గంగా వంటి సినిమాలలో ట్రాన్స్జెండర్ పాత్ర ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఇదే తరహాలోనే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ట్రాన్స్జెండర్ పాత్రలో నటించిన లక్ష్మి చిత్రాన్ని రాఘవ లారెన్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ విభిన్న కథ చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం మనకు తెలిసినదే.అయితే ఈ తరహాలోనే మరొక సీనియర్ నటుడు ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు గత కొద్ది రోజుల క్రితం తన బర్త్ డే సందర్భంగా గోవాలో సందడి చేసిన మిలింద్ సోమన్.ప్రముఖ మోడల్_ యాక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న మిలింద్ సోమన్ తన 55 వ పుట్టినరోజు సందర్భంగా తన ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా గోవా బీచ్ లో పరిగెత్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసినదే.

Telugu Milind Soman, Pourashapur, Transgender-Movie

బీచ్ లో అలా నగ్నంగా పరిగెత్తినందుకుగాను మిలింద్ సోమన్ పై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ప్రస్తుతం ఈ నటుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.తన ఇన్‌స్టాలో ‘పౌరాష్‌పుర్‌’ అనే వెబ్ షోలో తాను ట్రాన్స్‌ జెండర్‌ పాత్రను పోషిస్తున్నట్లు మిలింద్‌ సోమన్‌ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థర్డ్ జెండర్ చాలా శక్తివంతులు, ఏ సమస్యతో నైనా ఎంతో ధైర్యంగా పోరాడుతారంటూ, గతంలో ఎప్పుడు చేయని ఈ పాత్రను ఎంతో ఛాలెంజ్ గా స్వీకరించి ఈ పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు మిలింద్ సోమన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube