అమెరికాలో అబ్బాయిలు వింత వింత తీర్మానాలు..!!!     2018-12-05   14:31:49  IST  Surya

మీటూ ఉద్యమం ఎంతగా పాప్లర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మీటూ ఎఫెక్ట్ తో ఎంతో మంది ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది..దాంతో టచ్ చేస్తే షాకే అని భావించిన మగాళ్ళు ఇప్పుడు అమెరికాలో వింత వింత తీర్మానాలు చేసుకుంటున్నారట. ముఖ్యంగా వాల్‌స్ట్రీట్ ఉద్యోగులు ఆడవాళ్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట..దాంతో ఈ నిర్ణయం అక్కడ పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు మరింత ఇబ్బందిగా మారుతోంది.

Mike Pence About #Metoo Movement-Mike Movement NRI Telugu News Updates

అయితే వారు ఎలాంటి తీర్మానాలు పెట్టుకున్నారంటే..మహిళా ఉద్యోగులతో డిన్నర్‌కు వెళ్లవద్దని, విమానాల్లో పక్కన కూర్చోకూడదని..హోటల్‌లో వేర్వేరు ఫ్లోర్లలో రూమ్‌లు బుక్ చేసుకోవాలని..ఒంటరిగా జరిగే మీటింగ్‌లను నిరోధించాలన్న నిర్ణయాలు తీసుకున్నారట..కనీసం మాట్లాడటానికి సైతం వారు దూరంగా ఉంటున్నారట. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇచ్చిన పిలుపుతో ఇప్పుడీ సంప్రదాయం వాల్‌స్ట్రీట్‌లో కామన్‌గా మారింది.

Mike Pence About #Metoo Movement-Mike Movement NRI Telugu News Updates

ఇటీవల తన భార్య తనతో తప్ప మరొక యువతితో బయటకి వెళ్ళకూడదు అంటూ ఆమె హుకుం జారీ చేశారట దాంతో పెన్స్ ఈ విధంగా వ్యాఖ్యానించగా ఇప్పుడు అందరూ వాటిని ఆచరణలో పెడుతున్నారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఈ రకమైన ప్రవర్తన విశ్వవ్యాప్తం అయ్యి సంచలనం సృష్టిస్తోంది..అయితే ఈ రకమైన ప్రవర్తన మహిళలకి ఇబ్బంది కలిగించడం ఖాయం అంటున్నారు..నిపుణులు

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.