ఆ రాష్ట్ర మంత్రికి తప్పని కరోనా తిప్పలు.. ఆసుపత్రి ఫ్లోర్ శుభ్రంగా తుడిచి.. ?

ఈ కరోనా వల్ల మనషుల మనస్తత్వాలు బయటపడుతున్నాయి.సహాయం చేసే వారు ఎవరు.

 Mijoram Minister Cleans Hospital Floor-TeluguStop.com

ప్రజల కష్టాన్ని కరోనా పేరు చెప్పి దోచుకునే వారు ఎవరు అనేది ప్రజలకు క్షుణంగా అర్ధం అవుతుందట.ఇకపోతే కోవిడ్ బాధితులకు కొందరు ప్రత్యక్షంగా సహాయం చేస్తుంటే మరికొందరు పరోక్షంగా సహాయ పడుతున్నారు.

అంతే కాదు ఈ కరోనా మనుషుల మధ్య ఉన్న బేధాలను, స్దాయిని కూడా మరిపించేస్తుంది.అందుకు ఉదాహరణ మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్ జిర్లియానా.

 Mijoram Minister Cleans Hospital Floor-ఆ రాష్ట్ర మంత్రికి తప్పని కరోనా తిప్పలు.. ఆసుపత్రి ఫ్లోర్ శుభ్రంగా తుడిచి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయనతో పాటుగా మంత్రి భార్య, కుమారుడికి సైతం కరోనా పాజిటివ్ రాగా ఐజ్వాల్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో మంత్రి చికిత్స పొందుతున్న గది అపరిశుభ్రంగా ఉండడం గమనించి ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బందికి ఫోన్ చేశారట.కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన గదిలో ఫ్లోర్ ను స్వయంగా శుభ్రం చేసుకున్నారట.

ఈ సందర్భంగా తాను మంత్రినైనా, మామూలు మనిషినే, అవసరమైనప్పుడు ఇలాంటి పనులు చేయడం తప్పుగా భావించడం లేదని వెల్లడించడం విశేషం.ఇకపోతే మిజోరం విద్యుత్ శాఖ మంత్రి గా ఉన్నా కూడా తన అధికారమదాన్ని ప్రదర్శించకపోవడం లాల్ జిర్లియానా చెల్లింది.

#Lal Girliana #Hospital Floor #Cleans #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు