అమెరికాలో అక్రమ వలసలు...బలై పోతున్న ప్రాణాలు

అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే ఆర్ధికంగా స్థిరపడాలని అనుకునే వారు అందుకోసం అమెరిక ఇమ్మిగ్రేషన్ విధించే నియమ నిభంధనలకి లోబడి అతి కష్టం మీదట అన్ని పరీక్షలు దాటుకుంటూ అమెరికాలోకి ప్రవేశిస్తారు.ఆర్ధికంగా ఎదగడానికి, శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Migrant Deaths Along The Mexico United States Border-TeluguStop.com

అయితే ఈ నిభందనలు తుంగలోకి తొక్కి దొడ్డి దారిన, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాలని అనుకునే వారు అమెరికా సరిహద్దుల గుండా సైనికుల కళ్ళు గప్పి ప్రవేశిస్తూఉంటారు.అయితే ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు.

అక్రమ వలస దారుల ఏకైక లక్ష్యం అమెరికాలోకి ప్రవేశించడమే అందుకోసం ముళ్ళ తీగలని సైతం దాటుకుంటూ గాయాలపాలైనా సరే ముందుకు వెళ్తున్నారు.మరెంతో మంది ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు.

ముఖ్యంగా చిన్న పిల్లాలు ఈ క్రమంలో ఎంతో మంది అసువులు బాస్తున్నారు.మెక్సికో బోర్డర్ నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో హ్యరానా కి చెందిన ఆరేళ్ళ గురుప్రీత్ కౌర్ ఆరిజోనా ఎడారిలో మృతి చెందినా విషయం విధితమే.అయినా సరే పంజాబీల వలసలు అమెరికా వైపుగా ఆగడం లేదు.

మహిళలు పిల్లలు, అమెరికాలో ప్రవేశం కోసం ప్రాణాలకి తెగించి మరీ సాహసాలు చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.ఇప్పటికే ట్రంప్ అమెరికా వ్యాప్తంగా ఉన్న అక్రమ వలస దారులని పట్టుకుని వారి వారి స్వదేశాలకి పంపుతున్న విషయం విధితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube