ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అర్ధరాత్రి ఆ థియేటర్లలో సినిమా చూడొచ్చంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్( Salaar )ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే.ఈ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 Midnight Shows For Salaar In Telangana, Salaar Movie, Telangana, Prithviraj Suku-TeluguStop.com

అంతేకాకుండా గత వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ అలాగే సలార్ సినిమా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.అయితే సలార్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఎక్సైటింగ్ ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telugu Andhrapradesh, Shows, Prabhas, Prashanth Neel, Salaar, Telangana, Tollywo

అందులో భాగంగానే ప్రభాస్ అభిమానులు సంతోషించే ఒక వార్త జోరుగా వినిపిస్తోంది.కాగా తెలంగాణలో( Telangana ) గత కొంత కాలంగా మిడ్ నైట్ షోలు వేయడం లేదన్న విషయం తెలిసిందే.తెల్లవారుఝామున నాలుగు గంటలకు వేసుకోవడానికి అనుమతులు ఇస్తూ వచ్చారు.

ఆర్ఆర్ఆర్( RRR ), వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి లాంటివి వాడుకుని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి.అయితే సలార్ కు డిసెంబర్ 21 అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు షోలు వేసుకోవడానికి అనుమతులు వచ్చినట్టు ట్రేడ్ టాక్.

అయితే బుకింగ్స్ ఇంకా ఇవ్వలేదు.హైదరాబాద్ ప్రముఖ సింగల్ స్క్రీన్లు సంధ్య 70, భ్రమరాంబ, మల్లికార్జున, గోకుల్, శ్రీరాములు, దేవి, సుదర్శన్ లతో పాటు కొన్ని ప్రధాన మల్టీప్లెక్సుల్లో ప్రీమియర్లు వేసుకునేందుకు పర్మిషన్లు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్.

Telugu Andhrapradesh, Shows, Prabhas, Prashanth Neel, Salaar, Telangana, Tollywo

తర్వాత నాలుగు గంటల ఆట కొనసాగుతుంది.ఈ లెక్కన మొదటి రోజు ఆరు లేదా ఏడు షోలు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన కేంద్రాల్లో ప్రదర్శనలు ఉంటాయి.అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి వచ్చే జిఓ చూశాక పూర్తి క్లారిటీ వస్తుంది.అభిమానులు మాత్రం అప్పుడే టికెట్ల కోసం రికమండేషన్లు, సెలబ్రేషన్స్ తదితర ఏర్పాట్లలో ఉన్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.

నిర్మాతలు అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ఏ విషయం సోమవారం వరకు తేలకపోవచ్చు.తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వంద రూపాయల వరకు ఛాన్స్ ఉండగా ఏపీలో మాత్రం యాభైకే పరిమితం కావొచ్చని ఇన్ సైడ్ టాక్.

దగ్గరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సినిమాలకు సంబంధించి జగన్ సర్కార్ ధోరణి ఎలా ఉంటుందనేది ఊహకు అందటం లేదు.ఇలా అయితే డిసెంబర్ 22 పూర్తిగా తెల్లవారకుండానే సలార్ టాక్ పూర్తిగా బయటికి వచ్చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube