సరిగ్గా అర్ధరాత్రి వారికి గుడ్ న్యూస్ తెలిపిన జగన్ ప్రభుత్వం..!!

వైయస్ జగన్ ప్రభుత్వం అర్ధరాత్రి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ తెలిపింది.జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

 Midnight Jagan Governament Good News Announced Ys Jagan, Rtc Employees,latest N-TeluguStop.com

కాగా ఈసారి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీమా విషయంలో తాజాగా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది.  విషయంలోకి వెళితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల బీమా కోసం ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’ని ప్రవేశపెట్టింది.

ఈ ప్యాకేజీ ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం సంభవించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికంగా ఆదుకుంటుంది.

Telugu Ap, Apsrtc, Rtc Employees, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఈ ప్యాకేజీని భారీ పరిహారంతో ప్రవేశపెట్టారు.ఒకవేళ ఉద్యోగులు మరణిస్తే.వారి పిల్లల ఎడ్యుకేషన్ లోన్స్, ఆడపిల్లల వివాహ రుణాలను మాఫీ చేయనున్నారు.

ఇప్పటివరకు ఈ తరహా బీమా కేవలం పోలీసుల కుటుంబాలకు మాత్రమే అమలవుతూ ఉండగా తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగస్తులకు కూడా వర్తించనుంది.తాజా బీమా ప్రకటనతో దాదాపు 50 వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube