మధ్యరాతి యుగానికి చెందిన శునకం అవశేషాలు లభ్యం..!  

Middle Stone age Dog Bones Found, Sweden Scientists, 8400 year age dog, Dog Bones, Medieval Period - Telugu 8400 Year Age Dog, Dog Bones, Medieval Period, Middle Stone Age Dog Bones Found, South Swideen, Sweden Scientists

మధ్యరాతి యుగానికి చెందిన ఓ శునకం అవశేషాలను పరిశోధకులు గుర్తించారు.దాదాపు 8,400 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

TeluguStop.com - Middle Stone Age Dog Bones Found Sweden

దక్షిణ స్వీడన్ దేశంలో ఓ శ్మశానంలో మధ్యరాతి యుగానికి చెందిన అవశేషాలు బయట పడ్డాయి.చనిపోయిన వ్యక్తితో పాటు కుక్కు కూడా పూడ్చిపెట్టినట్లు పరిశోధకులు తెలుపుతున్నారు.

కుక్కను పూడ్చినట్లు అక్కడి ఆధారాలను బట్టి అంచనా వేస్తున్నారు పరిశోధకులు.నచ్చిన వస్తువులను పూడ్చి పెట్టడంలో భాగంగా ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కుక్కను కూడా పూడ్చి ఉంటారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

TeluguStop.com - మధ్యరాతి యుగానికి చెందిన శునకం అవశేషాలు లభ్యం..-General-Telugu-Telugu Tollywood Photo Image

దక్షిణ స్వీడన్ కు చెందిన పరిశోధకులు మాట్లాడుతూ… ‘‘దక్షిణ స్వీడన్ సాల్వ్స్ బర్గ్ పట్టణానికి సమీపంలో ఉన్న శ్మశానవాటికలో దాదాపు 8,400 ఏళ్ల నాటి శునకాన్ని గుర్తించాం.కుక్కకు సంబంధించిన అవశేషాలు భద్రంగా ఉన్నాయి.

ఈ ప్రాంతంలో సముద్ర మట్టం పెరగడం వల్ల శ్మశానవాటికలో బురద చేరడం వల్ల కుక్క అవశేషాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.అయితే ఈ శునకాన్ని తన యజమానితో పూడ్చి పెట్టినట్లు ఉంది.

యజమానికి ఇష్టమైన వస్తువులను పూడ్చే సంప్రదాయంలో భాగంగా కుక్కను కూడా పూడ్చి ఉంటారు.ఈ అవశేషాల ఆధారంగా ఆ కాలంలో ఇక్కడి ప్రాంతంలో ఏ ప్రజలు నివసించారో తెలుసుకోవచ్చు.

వారి నాగరికత, సంప్రదాయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం.ఆ దిశగా ఈ శ్మశానవాటికలో మరిన్ని తవ్వకాలు చేపడతాం.

ప్రస్తుతం శునకం అవశేషాలను శ్మశానవాటిక నుంచి బయటకు తీసి బ్లెకింగ్ మ్యూజియంకు తరలించాం.త్వరలో మరిన్ని పురాతన అవశేషాలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

’’ అంటూ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

#South Swideen #MiddleStone #Medieval Period #Dog Bones

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Middle Stone Age Dog Bones Found Sweden Related Telugu News,Photos/Pics,Images..