ఆ కష్టాలు వింటే మనస్సుకు బాధగా అనిపించింది.. గోపీచంద్ కామెంట్స్ వైరల్!

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.మాస్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సీటీమార్ లో ఏపీ కబడ్డీ కోచ్ గా నటించారు.

 Middle Range Hero Gopichand Comments About Real Kabaddi Players , 2019 Year, Jwa-TeluguStop.com

తాజాగా గోపీచంద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా శ్రీనివాస్ చిట్టూరి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

సంపత్ నందితో గతంలో గౌతమ్ నందా సినిమాలో నటించానని ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని గోపీచంద్ అన్నారు.మొదట సంపత్ నంది ఎడ్యుకేషన్ కు సంబంధించిన కథను చెప్పారని ఆ కథ తనకు అంతగా నచ్చలేదని గోపీచంద్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత కబడ్డీ ఆట నేపథ్యంలో కథ చెప్పారని ఆ కథతోనే ముందుకెళదామని తాను చెప్పానని గోపీచంద్ తెలిపారు.2019 చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిందని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

లాక్ డౌన్ వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైందని గోపీచంద్ పేర్కొన్నారు.సీటీమార్ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని గోపీచంద్ చెప్పుకొచ్చారు.ప్రేక్షకులతో సీటీ కొట్టించే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని గోపీచంద్ అన్నారు.తమన్నా బలమైన పాత్రలో కనిపిస్తారని మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా ఆమె పాత్ర సినిమాలో ఉంటుందని గోపీచంద్ పేర్కొన్నారు.

Telugu Jwala, Middle Range, Kabaddi, Seetimaar, September-Movie

సినిమాలో నిజమైన నలుగురు క్రీడాకారులు నటించారని వాళ్లు కబడ్డీ ఆటగాళ్లుగా రాణించడానికి పడిన కష్టాలను చెప్పిన సమయంలో తనకు బాధగా అనిపించిందని గోపీచంద్ చెప్పుకొచ్చారు.థియేటర్ లో సినిమా చూస్తే దొరికే అనుభూతి ఓటీటీలో రాదని ప్రత్యామ్నాయ వినోద మాధ్యమాలు వచ్చినా థియేటర్లు ఉంటాయని గోపీచంద్ అన్నారు.పక్కా కమర్షియల్ షూటింగ్ దాదాపుగా పూర్తైందని శ్రీవాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నానని గోపీచంద్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube