మిడిల్ క్లాస్ కొండలరావుకు దశ తిరిగింది.. ఒక్కసారిగా?  

కొందరికి అవకాశాలు ,అదృష్టం ఎన్నో రోజుల నుంచి గాని కష్టపడితే రావు.మరికొందరు మాత్రం రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీలుగా మారిపోతుంటారు.

TeluguStop.com - Middle Class Kondalarao Huge Offers For Films Goparaju Ramana

అయితే మిడిల్ క్లాస్ మెలోడీ ద్వారా తన నటనతో అందరిని ఆకట్టుకొని రాత్రికి రాత్రే ఒక పెద్ద స్టార్ అయ్యారు కొండలరావు.ఈ సినిమాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జీవించే వ్యక్తిగా తన నటన ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.

దీంతో ఒక్కసారిగా కొండలరావు పాత్రలో నటించిన గోపరాజు రమణ గారికి అవకాశాలు వెల్లువెత్తాయి.

TeluguStop.com - మిడిల్ క్లాస్ కొండలరావుకు దశ తిరిగింది.. ఒక్కసారిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం కరోనా కారణం వల్ల మూతపడ్డ థియేటర్లు ఇప్పటికీ తెరుచుకోలేదు.

ఈ పరిస్థితిని ఓటీటీ ప్లాట్ ఫామ్ బాగా క్యాష్ చేసుకుంది.ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సినిమాలను ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే ఓటీటీ ద్వారా పలు చిత్రాలు విడుదల అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది.

తమిళ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా వంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఓటీటీ ద్వారా విడుదలయ్యాయి.ఈ నేపథ్యంలోనే గత వారం విడుదలైన మిడిల్ క్లాస్ మెలోడీ సూపర్ హిట్ ను అందుకుంది.ఇందులో ఆనంద్ దేవరకొండ, వర్ష హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో కొండలరావు పాత్రలో గోపరాజు రమణ కీలక పాత్ర పోషించారు.మధ్యతరగతి కుటుంబంగా, వాస్తవానికి చాలా దగ్గరగా ఎంతో సింపుల్ గా తీసిన ఈ చిత్రం ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది.

ఈ సినిమాలో కొండలరావు పాత్రలో నటించిన గోపరాజు రమణ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా తన హావభావాలను వ్యక్తపరుస్తూ, నటనకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు.కొండలరావు పాత్రద్వారా రాత్రికి రాత్రి పెద్ద స్టార్ అయినా గోపరాజుకు అవకాశాలు క్యూ కట్టాయి.

పలు సినిమాలలో నటించినప్పటికీ మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం తనకు ప్రత్యేకమైన గుర్తింపును తేవడంతో ఈ చిత్రం ద్వారా అతని దశ తిరిగిందని చెప్పవచ్చు.ఈ చిత్రం తర్వాత ఆయనకు పలు సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.

#MiddleClass #Goparaju Ramana #MidleClass

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు