అమెరికాలో మధ్యంతర ఎన్నికలు..!!!  

Mid Elections In America For Year 2018-

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఈ ఎన్నికల్లో ట్రంప్ పాలనకి చరమ గీతం పాడాలని అందరూ ఎదురుచూస్తున్నారు…ట్రంప్ భవితవ్యం ఏమిటో ఈ ఎన్నికల్లో తేలిపోతుందని అంటున్నారు నిపుణులు. నవంబర్ 6న అమెరికన్ కాంగ్రెస్‌పై ఆధిపత్యానికి పోరు జరుగుతుంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో పోటీ పడనున్నారు…అయితే ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లే మెజారిటీలో ఉన్నారు..

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు..!!!-Mid Elections In America For Year 2018

ప్రస్తుత సెనేట్ లో 51మంది రిపబ్లికన్లు, 49 మంది డెమొక్రాట్లు ఉన్నారు.అయితే ఇప్పుడు దాదాపు 30శాతం డెమొక్రాట్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.యూఎస్ కాంగ్రెస్‌లో మరో భాగం ప్రతినిధుల సభ. అందులో 240మంది రిపబ్లికన్లు, 195మంది డెమొక్రాట్లు ఉన్నారు. ఈ సభకు జరిగే ఎన్నికల్లో కూడా డెమొక్రాట్లకు మెజారిటీ రావొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే ఒకవేళ ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు నెగ్గితే, ట్రంప్ నిర్ణయాలను వీళ్లు అడ్డుకునే అవకాశం ఉంటుంది. ట్రంప్ పైన, ఆయన పాలనలోని నిర్ణయాలపైన విచారణ జరిపించే అధికారం వారికి లభిస్తుంది. అవసరమైతే ట్రంప్‌ పై అభిశంసన తీర్మానం కూడా పెట్టొచ్చు…కానీ, రెండు సభల్లోనూ మళ్లీ రిపబ్లికన్లకే మెజారిటీ లభిస్తే తన విధానాలను అమలు చేయడంలో ట్రంప్‌కు ఎదురు ఉండకపోవచ్చు.