విండోస్ యూజ‌ర్లకు మైక్రోసాఫ్ట్ వార్నింగ్.. వెంట‌నే అది చేయాలంట‌..!

మైక్రోసాఫ్ట్​ విండోస్​ దాదాపుగా అధికంగా ల్యాప్​టాప్​, పీసీలలో కనిపించే ఆపరేటింగ్ సిస్టమ్​.మరో ఆపరేటింగ్​ సిస్టమ్​ మాక్​ ఉన్నప్పటికీ దానిని ఎక్కువగా ఉపయోగించరు.

 Microsoft Warning To Windows Users .. Do It Immediately ..!, Microsoft, Hackers,-TeluguStop.com

మైక్రోసాఫ్ట్​ విండోస్​ ఆపరేటింగ్​ సిస్టమ్​నే సాధారణ జనాలు వాడుతుంటారు.అయితే ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్​ విండోస్​ ముచ్చట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే.

దానికి ఓ కారణం ఉంది.

మైక్రోసాఫ్ట్​ విండోస్​ తన వినియోగదారులకు అత్యవసరంగా కొన్ని సూచనలు చేసింది.

అదేంటంటే మైక్రోసాఫ్ట్​ సంస్థ యొక్క విండోస్​ 10, విండోస్​ 7 వాడుతున్న వారు వెంటనే తమ ఆపరేటింగ్ సిస్టమ్​ను ఆప్​డేట్​ చేసుకోవాలి అని సూచించింది.విండోస్​ 10లో ఓ లోపం బయటకు వచ్చిందని, ఆ లోపం వల్ల మీ డాటా చోరికి గురి అయ్యే అవకాశం ఉందని చెప్పింది.

దానిని నివారించేందుకు ఆపరేటింగ్ సిస్టమ్​లో అవసరమైన మార్పులు చేశామని, వెంటనే విండోస్​ను అప్డేట్​ చేసుకుంటే మీ కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు సురక్షితంగా ఉంటాయని చెప్పింది.

Telugu Hackers, Microsoft, System, Windows, Windows User-Latest News - Telugu

ఇంతకీ ఏంటా లోపం, ఎందుకంత తొందర అంటారా ? దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.సాధారణంగా విండోస్​ 10లో ప్రింట్ స్పూలర్​ అనే అప్లికేషన్​ ఇన్​బిల్డ్​గా ఇన్​స్టాల్​ చేయబడి వస్తోంది.దీంతో ఎక్కువ సంఖ్యలో ల్యాప్​​టాప్​ లేదా కంప్యూటర్ల ద్వారా ఒకే సారి ప్రింటింగ్​ సౌకర్యం పొందవచ్చు.

అయితే ఆ అప్లికేషన్​లో లోపం ఉందని ఓ సైబర్​ సెక్యూరిటీ కంపెనీ రీసెర్చర్​ కనిపెట్టాడు.దానిని ఈ ఏడాది మేలో మైక్రోసాఫ్ట్​ కంపెనీకి తెలియజేశారు.అయితే ఈ లోపం వల్ల డాటా ఎలా చోరి చేయవచ్చో అనే వివరాలను కూడా బయటి ప్రపంచానికి వెళ్లడించాడు.దీనిని గుర్తించిన మైక్రోసాఫ్ట్​ ఆ వివరాలను డిలీట్​ చేయించింది.

కానీ అప్పటికీ కొందరికి చేతిలోకి మాత్రం వెళ్లిపోయింది.ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని గుర్తించిన మైక్రోసాఫ్ట్​ ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించింది.

అందులో భాగంగానే ఇప్పుడు ఆపరేటింగ్​ సిస్టమ్​ను అప్డేట్​ చేయాలని సూచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube