టెక్నాలజీ ఇస్తే మాత్రం కరెంట్ ఉండాలి కదా  

Microsoft Plans To Take Technology To 5 Lakh Indian Villages: Satya Nadella -

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామి కావాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ నిర్ణయించారు.దీని ప్రకారం ఇండియాలోని అయిదు లక్షల గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్ బ్యాండ్ సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అనుకుంటున్నారు.

అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న విందు కార్యక్రమంలో సత్య నాదెళ్ళ ఈ విషయం ప్రకటించారు.గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించడం వాళ్ళ అది ఇండియా అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.

Microsoft Plans To Take Technology To 5 Lakh Indian Villages: Satya Nadella-General-Telugu-Telugu Tollywood Photo Image

సత్య నాదెళ్ళ ఆలోచన మంచిదే.అభినందనీయమే.

కాని దేశంలోని అనేక గ్రామాలకు కరెంట్ సౌకర్యం లేదు.ఎండా కాలంలో కరెంటు కోతలు ఎంత భయంకరంగా ఉంటాయో అందరకీ అనుభవమే.

టెక్నాలజీని ఉపయోగించుకోవాలంటే విద్య కూడా అవసరం కదా.గ్రామాల్లో సాధారణ విద్య బోధించడమే కష్టంగా ఉంది.ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్ళలో కంప్యుటర్ విద్య ప్రవేశపెట్టారు.కాని ఇప్పటివరకు అది సజావుగా సాగిన దాఖలాలు లేవు.కంప్యూటర్లు ఉంటే బోధకులు ఉండరు.బోధకులు ఉంటే సిస్టంలు ఉండవు.

వీరికి జీతాలు సరిగా ఇవ్వడం లేదు.డిజిటల్ ఇండియా అని గొప్ప పేరు పెట్టుకొని గ్రామాలకు టెక్నాలజీ ఇస్తామని ప్రచారం చేస్తే ప్రయోజనం లేదు.

టెక్నాలజీ ఉపయోగించడానికి అవసరమైన వసతులు కల్పించాలి.

తాజా వార్తలు

Microsoft Plans To Take Technology To 5 Lakh Indian Villages: Satya Nadella- Related....