1800 ఉద్యోగాలు ఒక్క రోజు లో పీకేస్తున్నారు

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్ల తయారీకి గుడ్ బై చెప్పేసింది.మొబైల్ ఫోన్ల తయారీలో పేరెన్నికగన్న ఫిన్ ల్యాండ్ కంపెనీ నోకియాను కొనుగోలు చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.

 Microsoft Cuts 1800 More Jobs At Smartphone Unit-TeluguStop.com

నోకియా స్మార్ట్ ఫోన్ వెర్షన్లు లూమియా, ఆ తర్వాత విండోస్ ఫోన్ల వ్యూహాలు దెబ్బతిన్న నేపథ్యంలో అలవాటు లేని వ్యాపారాల నుంచి తప్పుకునేందుకే మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది.ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

సంస్థ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న 1,850 మంది ఉద్యోగులపై వేటు పడనుంది.వీరిలో నోకియా నుంచి తమ కంపెనీలో చేరిన ఉద్యోగులే 1,350 మంది ఉన్నట్లు సమాచారం.

వీరంతా నోకియా సొంత దేశం ఫిన్ ల్యాండ్ లో పనిచేస్తున్నవారే అధికంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube