బంపర్ ఆఫర్: ఆ కంపెనీ ఉద్యోగుల అకౌంట్స్ లోకి ఏకంగా లక్ష బోనస్..!

కరోనా కష్ట కాలంలో ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే.ఉద్యోగులు సైతం ఉద్యోగాలు లేక ఇంటికే పరిమితం అయ్యారు.

 Microsoft Company Giving Pandemic Bonus Of One Lakh Rupees To Its Employees , Bu-TeluguStop.com

ఈ క్రమంలో ఉద్యోగుల ఇబ్బందులను అర్ధం చేసుకుని, వాళ్ళకి మంచి చేసే క్రమంలో ఐటీ కంపెనీలు ఒక మంచి ఆలోచన చేసారు.అది ఏంటంటే.

ఐటీ కంపనీలో పనిచేసే ఉద్యోగులకు అక్షరాలా ఒక లక్ష రూపాయల వరకు బోనస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ఈ డబ్బులు ఏ క్షణంలో అయిన ఉద్యోగుల అకౌంట్లలో పడవచ్చు.

అయితే ఈ డబ్బులు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పడవండోయ్.కేవలం టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే పడతాయట.

అయిన లక్ష రూపాయిల బోనస్ అంటే ఆషామాషీనా చెప్పండి.కానీ.

, ఇది నిజం.టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు ఈ బోనస్ అందచనుంది.

మైక్రోసాఫ్ట్ సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు కరోనా కాలంలో పాండామిక్ బోనస్ కింద లక్ష రూపాయిలను ఇవ్వనుంది.కానీ మైక్రోసాఫ్ట్ లోని GitHub, LinkedIn, and Zenimax లలో పని చేసే ఉద్యోగులకు మాత్రం ఈ బోనస్ వర్తించదట.

మిగతా మైక్రోసాఫ్ట్ లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ అందనుంది.

Telugu Bumper, Pandemic Bonus, Employees, Lakshs Bonus, Rupees, Panadamic Time,

కరోనా వైరస్ కష్టకాలంలో తమ కంపెనీలో పని చేసే ఉద్యోగుల ఇబ్బందులను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిని ఆదుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.జూలై నెల లేదా ఆగస్ట్ నెలలో ఈ బోనస్ డబ్బులు అమెరికా, విదేశీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల అకౌంట్లలోకి పడనున్నాయి.కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువున్న ఉండే అందరికి గిఫ్ట్ గా ఈ బోనస్ ఇవ్వనుంది.

ఎంతమంది ఉద్యోగులు ఈ గిఫ్ట్ అందుకోనున్నారో ఒకసారి చూద్దాం.ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో 1,75,508 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

Telugu Bumper, Pandemic Bonus, Employees, Lakshs Bonus, Rupees, Panadamic Time,

వీళ్ళందరికీ బోనస్ ఇవ్వబోతున్నారు.ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కంపెనీపై బోనస్ కింద 200 మిలియన్ డాలర్ల అదనపు భారం పడనుంది.అయితే ఈ బోనస్ కూడా అందరి సిబ్బందికి వర్తించదు.కేవలం మార్చి 31, 2021వ సంవత్సరానికి ముందు చేరిన కంపెనీ సిబ్బందికి మాత్రమీ ఈ ఆఫర్ వర్తించనుంది.

ఉద్యోగుల బాధలను అర్ధం చేసుకుని వాళ్ళ కష్టాలను తీరుస్తున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ నిజంగా గ్రేట్ కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube