బిల్‌గేట్స్ విలాసవంతమైన నౌక, ధర. 4,600 కోట్లు: స్పెషల్ ఫీచర్ ఇదే

బిల్‌గేట్స్.మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడు.

 Microsoft Co Founder Bill Gates Buys A Superyacht-TeluguStop.com

అటువంటి వ్యక్తి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

ఇందుకోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా పర్ఫెక్షన్ సాధిస్తారు.ఎందుకంటే ప్రపంచం వాళ్లనే చూస్తుంది కాబట్టి.

ఇక అసలు మేటర్‌లోకి వెళ్తే.బిల్‌గేట్స్ ఓ సూపర్‌యాచ్‌ (పడవ)ను కొనుగోలు చేశారు.

ప్రతి ఏటా వేసవిలో సముద్రయానం చేసే గేట్స్.ఇప్పటి వరకు ట్రావెల్ సంస్థకు చెందిన పడవల్లోనే ప్రయాణం చేసేవారు.అయితే ఈ మధ్యకాలంలో జరిగిన మొనాకో యాచ్ షోలో అందరి దృష్టినీ ఆకర్షించిన ‘‘ఆక్వా’’ అనే యాచ్ ఎకో ఫ్రెండ్లీ.అంటే ఏ మాత్రం పర్యావరణానికి హానీ చేయదన్న మాట.లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచే ఈ భారీ నౌక… కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్ధంగా బయటకు వదులుతుంది.ఈ విధంగా లిక్విడ్ హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలో ఏకైక బోటు ఇదే.

Telugu Gates, Liquid Hydrogen, Telugu Nri-Telugu NRI

ఈ ఫీచరే బిల్‌గేట్స్‌ను ఆకర్షించింది, అంతే ఏ మాత్రం ఆలోచించకుండా తనకు ఒకటి కావాలని ఆర్డర్ ఇచ్చి డబ్బు మొత్తం చెల్లించారు.అన్నట్లు దీని ధర ఎంతో తెలుసా.645 మిలియన్ డాలర్లు (రూ.4,600 కోట్లు).370 అడుగుల పొడవైన ఈ యాట్‌లో జిమ్, యోగా స్టూడియో, మసాజ్ పార్లర్, కాస్కాడింగ్ ఫూల్ కూడా ఉన్నాయి.ఇందులో 14 మంది అతిథులు ఉండొచ్చు.

ఇంకా నాలుగు రెస్ట్ రూములు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్ ఉంటాయి.

నౌక నడిచేందుకు వీలుగా 28 టన్నుల బరువుండే రెండు ట్యాంకుల నిండా లిక్విడ్ హైడ్రోజన్ నింపి -253 డిగ్రీల సెల్సియస్ వద్ద గడ్డకట్టిస్తారు.

ఒక్కసారి నౌకలో ఇంధనాన్ని నింపితే 3,750 మైళ్లు ఆగకుండా ప్రయాణిస్తుంది.దీని వేగం గంటకు 17 నాటికల్ మైళ్లు.

అతిథులకు సహకారం అందించేందుకు గాను 31 మంది సిబ్బంది నౌకలో అందుబాటులో ఉంటారు.ఒకవేళ నౌక నుంచి బయటకు వెళ్లి విహారం చేయాలని అనుకుంటే 32 అడుగుల పొడవుండే రెండు చిన్న బోట్లు ఉంటాయి.

ప్రస్తుతం తయారీ దశలో ఉన్న ఈ నౌక 2024 నాటికి బిల్‌గేట్స్ చేతికి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube