మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి మృతి

ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా మన తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కించుకున్న సత్య నాదెళ్ల తండ్రి ఒక మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్‌.

 Microsoft Ceo Satya Nadendla Father Died-TeluguStop.com

నేడు సత్య నాదెళ్ల తండ్రి యుగందర్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదు.

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యుగందర్‌ గారు మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యుల నుండి ప్రకటన వచ్చింది.

పీవీ నరసింహారావు హయాంలో గ్రామీణాభివృద్ది శాఖలో కీలక బాధ్యతలు పోషించిన యుగందర్‌ గారు యూపీఏలో పాలన ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.ఐఏఎస్‌ అధికారిగా చాలా నిబద్దతతో పని చేయడంతో పాటు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.1962 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన యుగందర్‌ గారి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంలో మునిగి పోయారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులు యుగందర్‌కు నివాళ్లు అర్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube