మైక్రోసాఫ్ట్ హెచ్చరిక! పది లక్షలు కంప్యూటర్స్ ప్రమాదంలో ఉన్నాయంట

సాంకేతిక విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉందో అంతే స్థాయిలో ప్రజల వ్యక్తిగత భద్రతకి ప్రమాదం ఏర్పడుతుంది అనే విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రజల వ్యక్తిగత భద్రత కార్పొరేట్ కంపెనీల చేతులలోకి వెళ్లిపోయింది.

 Microsoft Bug Alert 1 Million Computers Still Vulnerable To Malware-TeluguStop.com

దీనిని కంపెనీలు కూడా మార్కెట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాయి.ఇదిలా ఉంటే మరో వైపు సోషల్ మీడియా ద్వారా భద్రత లేదు అనుకుంటే ఇప్పుడు మాల్ వేర్ వైరస్ ద్వారా కంప్యూటర్స్ మీద దాడి జరిగే ప్రమాదం ఉందని మైక్రో సాఫ్ట్ సంస్థ హెచ్చరించింది.

అంతర్జాతీయంగా దాదాపు పది లక్షల కంప్యూటర్ల మీద మాల్‌వేర్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది.2017 తరహాలోనే తాజాగా వైరస్‌ బ్లూకీప్ తో దాడి చేసే అవకాశం ఉందని, అయితే వినియోగదారులు తమ కంప్యూటర్లను కాపాడుకోవాలంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ మరోసారి వెల్లడించింది.ఈ మాల్‌వేర్‌ను సమస్యకి పరిష్కారం ఇప్పటికే సిద్ధం అయిన ఇప్పటిరకు వైరస్‌ జాడలు కనిపించలేదు.అలాగని పూర్తిగా ముప్పు నుంచి తప్పించుకున్నట్లు కాదు అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి హెచ్చరించారు.

విండోస్‌ ఎక్స్‌పీ, విండోస్‌ 7, సర్వర్‌ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఈ మాల్‌వేర్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube