' మెష్' టెక్నాలజీతో ముందుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌..!

ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ తమ యూజర్ల కోసం వర్చువల్ రియాల్టీ టెక్నాలజీలో సరికొత్త ను అందుబాటులోకి తీసుకువచ్చింది.మైక్రోసాఫ్ట్ మెష్ పేరుతో యూజర్లకు మిక్స్‏డ్ రియాల్టీ అనుభూతిని కల్పించనుంది.

 Microsoft Advanced With Mesh Technology-TeluguStop.com

దీంతో యూజర్లు ఒక స్థలంలో ఉండి వీడియో కాల్ చేసినప్పుడు ఏదైనా రూపంలో కనిపించే వీలును కల్పించింది.ఉదహరణకు ఈ మిక్స్‏డ్ రియాల్టీ టెక్నాలజీతో ఇంట్లోనే ఉండి సహుద్యోగులతో, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వాస్తవా రూపంలో కాకుండా ఇతర రూపంలో కనిపిస్తుంటారు.

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అజ్యూర్ సహకారంతో వేర్వేరు ప్రాంతాల్లో వివిధ డివైజ్‏లలో కనెక్ట్ అయి హోలోగ్రాఫిక్ అనుభవాలను పంచుకునే వీలును మైక్రోసాఫ్ట్ మెష్ ద్వారా కల్పించనుంది.

 Microsoft Advanced With Mesh Technology- మెష్’ టెక్నాలజీతో ముందుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ వర్చువల్ డిజైన్ సెషన్స్, మీటింగులు లేదా చర్చలు జరుపుకునేందుకు తమ పార్టనర్స్‏తో నేరుగా కలుసుకునే అవసరం లేకుండా దీనిని అందుబాటులోకి తీసుకోచ్చినట్లుగా ఆ సంస్థ తెలిపింది.

మిక్స్‌డ్‌ రియాల్టీ టెక్నాలజీతో యూజర్లు ప్రత్యేక క్యారెక్టర్లను క్రియేట్‌ చేసే అవకాశం ఉంటుంది.దీని కోసం మొబైల్‌, ట్యాబ్స్‌, పీసీలు, వీఆర్‌ హెడ్‌సెట్లు, హోలోలెన్స్‌ వంటి పరికరాలతో ఎక్కడి నుంచైనా కనెక్ట్‌ కావచ్చని సంస్థ పేర్కొంది.

యూజర్లు తమ ఫోన్ లో హోలోలెన్స్‌ను ఉపయోగించి ఇంజినీర్లు, డిజైనర్లు ఏవైనా ఉత్పత్తుల గురించి 3డీలో చర్చించేందుకు వీలుంటుంది.దీనిద్వారా ఉత్పత్తులను రెడీ చేయకుండానే ముందుగానే ఈ 3డీ టెక్నాలజీ సహయంతో ఉత్పత్తులను సృష్టించి వాటిపై చర్చించే అవకాశం ఉంటుంది.

అలానే ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు త్రీడీ ఎఫెక్ట్‌లో నిర్మాణంలోని పరిశ్రమ ఫ్లోర్‌ను పరిశీలించి ఎక్కడ ఎలాంటి యంత్రాలను ఫిట్‌ చేయాలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనవసరమైన ఖర్చును తగ్గించుకోవచ్చు.

#Microsoft #Mesh Technology #Advanced #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు