సరికొత్త మెమొరీ కార్డు.. ఏకంగా 1.5 టీబీ స్టోరేజీ సామర్ధ్యం..

ప్రముఖ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ తయారుచేసిన ఒక మైక్రోఎస్‌డీ కార్డు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఇందులో ఏకంగా 1.5 టీబీ స్టోరేజ్ కెపాసిటీ అందించడమే ఇందుకు కారణం.1.5టీబీ అంటే 1500జీబీకి పైగా మెమొరీ అన్నమాట.అంటే హైక్వాలిటీ గల వీడియోలను ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు.

 Micron Designs Micro Sd Card With 1500 Gb Storage Capacity Details, New Memory C-TeluguStop.com

హోమ్ సెక్యూరిటీ కెమెరాలు, డిజిటల్ కెమెరాలు, డ్యాష్ క్యామ్స్‌, పోలీసుల సెక్యూరిటీ కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది సూపర్ గా సెట్ అవుతుంది.అంతేకాదు, భారీ వ్యాపారవేత్తలకు చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేందుకు ఈ మైక్రోఎస్డీ కార్డ్ బాగా పనిచేస్తుంది.

దీని పేరు మైక్రాన్ ఐ400 కాగా దీనిని తాజాగా ఒక డిజిటల్ కాన్ఫరెన్స్‌లో కంపెనీ ఆవిష్కరించింది.దీని ధర అధికంగానే ఉండొచ్చని సమాచారం.

అలాగే ఈ కార్డ్స్‌ అందరికీ లభించవని తెలుస్తోంది.ఎందుకంటే ఇవి లిమిటెడ్ గా అందుబాటులోకి వచ్చి హాట్‌కేకుల్లా అమ్ముడు పోయే అవకాశం ఉంది.

దీని లాంచ్ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.ఒక అంగుళం పరిమాణంలో ఉండే చిప్‌లో 1.5టీబీ స్టోరేజ్ అందించడానికి ఈ కంపెనీ 176-లేయర్ 3D NAND అనే ఒక కొత్త టెక్నాలజీ ఉపయోగించింది.ఈ ఎస్‌డీ కార్డ్ సెకన్‌కు 4జీబీ వరకు డేటా ట్రాన్స్‌ఫర్‌కు సపోర్ట్ చేయడం మరో విశేషం.

దీనిని ఐదేళ్లపాటు నిరంతరంగా వాడినా డేటా ట్రాన్స్‌ఫర్‌ స్పీడ్ ఏ మాత్రం తగ్గదు.అలాగే ఇది పాడు కాదు.

Telugu Tb, Tb Micro Sd, Gbstorage, Capacity Memory, Micro Sd, Micron, Memory, St

అయితే ఈ కార్డును స్మార్ట్ ఫోన్స్ లో ఉపయోగించడం వీలుకాదు.ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా 1టీబీ మాక్సిమమ్ ఎక్స్‌పాండబుల్ లిమిట్‌తోనే వస్తున్నాయి.అందువల్ల ఇది అందుబాటులోకి వచ్చినా వీటిని ఫోన్ లో వాడటం కుదరదు.నిజానికి ఈ రోజుల్లో రెగ్యులర్ యూజర్లకి సరిపడా ఇంటర్నల్ స్టోరేజ్ ని మొబైల్ కంపెనీలు తమ ఫోన్స్‌లో అందిస్తున్నాయి.

అలాగే క్లౌడ్ స్టోరేజ్ కూడా అదనపు ఫైల్ స్టోరేజ్ చేసుకోడానికి ఉపయోగపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎస్‌డీ కార్డ్స్ ఫోన్ యూజర్లకు అంతగా అవసరం పడటం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube