ఇంట్లో నే ఉండి పని చేయడం వల్ల అలాంటి సమస్యలు వస్తాయంటున్న మైక్రోసాఫ్ట్ సీఈవో...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన  సంగతి అందరికీ తెలిసిందే.అయితే లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే పలు సంస్థలు తాత్కాలికంగా మూసివేశారు.

 Satya Nadella, Microsoft Ceo, Work From Home, Sensational Comments, Communicatio-TeluguStop.com

మరి కొన్ని సంస్థల్లో అయితే తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఇంటి నుంచి పని చేస్తున్నటువంటి ఉద్యోగులు ఒకపక్క పని చేస్తూనే మరో పక్క తన కుటుంబ సభ్యులతో జాలీగా గడుపుతున్నారు.

అయితే తాజాగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విషయంపై ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇందులో ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వల్ల కొంత మేర కమ్యూనికేషన్ సమస్యలు ఎదురవుతాయని తెలిపాడు.

అంతేకాక ఉద్యోగులంతా ఒక టీ మ్ గా పని చేయడం వల్ల పలు ఆలోచనలు మరియు కీలక  నిర్ణయాలు తీసుకోగలరని అలా కాకుండా ఇంటి వద్ద ఒక్కరే పనిచేయడం వల్ల పలు ఒత్తిడి సమస్యలు కూడా ఎదురవుతాయని చెప్పుకొచ్చాడు.అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కలిసికట్టుగా పని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని కూడా తెలిపాడు.

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చేసినటువంటి వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఇందులో భాగంగా కొంతమంది నెటిజన్లు మరియు ఉద్యోగులు కొన్ని సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు సంవత్సరంలో 365 రోజులు పని చేస్తూ ఉంటారని అలాంటివారికి ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పించడంతో కొంతమేరకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరైతే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో ఎక్కువమంది సంపాదన నిమిత్తమై తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి దూరంగా ఉంటున్నారని, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కుటుంబ బాంధవ్యాలు, సత్సంబంధాలు వంటి వాటికి ముప్పు వాటిల్లుతుందని కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ మంచిదేనని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube