డోలో 650 మీద వైర‌ల్ అవుతున్న మీమ్స్.. తగ్గేదే లే అంటున్న సంస్థ ఎండీ..

కరోనా కంగారు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వేళ ప్రతి ఒక్కరూ ఏదైనా కంగారు వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించకుండా మొదటగా డోలో 650 గోళీలనే మింగుతున్నారు.డోలో మాత్రలు మింగినా కానీ తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్తున్నారు.

 Micro Labs Md Dileep Surana Response On Dolo 650memes,dolo 650 Funny Memes,micro-TeluguStop.com

ఇలా చేయడం వలన చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా డోలో 650 ట్యాబెట్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.దీనిపై గత కొన్ని రోజులుగా నెట్టింట ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఇది చూసిన అనేక మంది డోలో 650 గొప్పతనం అదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.డోలో 650 యొక్క విలువేంటో ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చిందని కూడా అంటున్నారు.

ఇక ఈ మీమ్స్ పై డోలో 650 ట్యాబెట్లను తయారు చేసే మైక్రో ల్యాబ్స్ ఎండీ దిలీప్ సురానా కూడా స్పందించారు.

Telugu Corona Vaccine, Covid, Dolo, Dolo Memes, Microlabs-Latest News - Telugu

ఇటీవల డోలో 650 అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ప్రధాన లక్షణాలను నివారించే ఔషధంగా డోలో 650 పని చేస్తుందని ఆయన తెలిపారు.ఇక కరోనా వైరస్ ప్రధాన లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరాలను డోలో 650 ట్యాబ్లెట్ తగ్గిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అందుకోసమే ఏ మాత్రం నలతగా అనిపించినా ముందుగానే డోలో 650 ట్యాబ్లెట్ ను వేసుకుంటున్నారు.ఆ తర్వాత కూడా వారి పరిస్థితి మెరుగు కాకపోతే తర్వాత డాక్టర్ ను సంప్రదిస్తున్నారు.

ఇలా ప్రతి ఒక్కరూ డోలో 650 ట్యాబ్లెట్లను వేసుకోవడం వలనే డోలో 650 అమ్మకాలు గడిచిన కొద్ది రోజుల నుంచి విపరీతంగా పెరుగుకుంటూ వచ్చాయి.ఇక డోలో వేసుకున్న చాలా మందికి వారి నలత అనేది తగ్గుతుందని చెబుతున్నారు.

ఇక విచిత్రం ఏమిటంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా డోలో 650 మాత్రలనే మింగమని అనేక మంది వైద్యులు చెబుతుండడం గమనార్హం. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో బాగా పాపుల‌ర్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube