మాస్ సాంగ్ తో అదరకొట్టిన మిక్కీ జే మేయర్..!

తాజాగా హీరో శర్వానంద్ నటిస్తోన్న చిత్రం శ్రీకారం.ఈ సినిమా కు సంబంధించిన పాటను తాజాగా విడుదల చేశారు.

 Sharwanand’s ‘sreekaram’ First Song Teaser Looks Massy - Telugu Bhalegundi-TeluguStop.com

‘ భలేగుంది బాల ‘ అంటూ సాగె లిరిక్ తో మొదలయ్యే ఈ పాటను విడుదల చేశారు.సినిమాకి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తుండగా.ఆయన సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది.

అంతేకాక ఈ సినిమాలో సాయికుమార్, మురళి శర్మ, రావు రమేష్, నరేష్, ఆమని, సప్తగిరి, సత్య మొదలగువారు ప్రధాన తారాగణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు కిషోర్ రెడ్డి అలాగే రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట వారు 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేయాలనుకున్న చివరికి కరోనా వైరస్ కారణంతో వాయిదా పడుతూ వస్తోంది.ఇకపోతే ఎన్నో మెలోడీస్ అందించిన మిక్కీ జే మేయర్ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా విడుదలైన శ్రీకారం లోని పాటలు వింటే ఈ పాటకు మిక్కి.జె.మేయర్ సంగీత దర్శకుడు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.దీనికి కారణం అంత సాంగ్ ఆయన ఇవ్వడమే.

ఈ పాటకి రాయలసీమ ప్రాంతానికి చెందిన పెంచల్ దాస్ రాయడమే కాకుండా ఆయననే పాడారు.ఇకపోతే గద్దలకొండ గణేష్ సినిమా నుండి మిక్కీ జే మేయర్ రూటు మార్చినట్లు అర్థమవుతోంది.

దర్శకుడి కోరిక మేరకు ఎలాంటి జోనర్ లో అయినా సరే అతడు మ్యూజిక్ ఇవ్వగలరని మరోసారి నిరూపించుకోడానికి ఈ పాటని సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.గత సంవత్సరం ఆగస్టు నెలలో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత షూటింగ్ కోసం అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ఉన్న పల్లెటూరు లను ఎంచుకొని గత సంవత్సరం నవంబర్ నెలలో అక్కడ షూటింగ్ జరుపుకుంది.

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ జనవరి 27న విడుదల చేయడం జరిగింది.చూడాలి మరి ఈ సినిమా తో శర్వానంద్ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పిస్తాడో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube