ఇండియన్స్ వివాహాలపై అమెరికా యూనివర్సిటీ పరిశోధన..ఏమి తేలిందంటే...!!!  

Michigan University Study On Indian Marriages-

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ భారతీయుల వివాహాలపై పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది.భారతీయులలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉండే వారు కులాంతర వివాహాలపై ఎక్కువగా దృష్టి పెట్టారని తమ అధ్యయనంలో తేలిందని తెలిపింది.వారు వివాహాలు కుదిర్చే..

Michigan University Study On Indian Marriages--Michigan University Study On Indian Marriages-

మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు లోని డేటాని విశ్లేషించిన తరువాతే ఈ నిర్ధారణకి వచ్చినట్టుగా చెప్పింది.

Michigan University Study On Indian Marriages--Michigan University Study On Indian Marriages-

కానీ విదేశాలలో ఉండే ప్రవాస భారతీయులు మాత్రం అందుకు సిద్దంగా లేరని, తాము విదేశాలలో తమ సంస్కృతికి తగ్గట్టుగా నడుచుకుంటామని తెలిపినట్టుగా కూడా మిచిగాన్ యూనివర్సిటీ వెల్లడించింది.వారు భారత్ లోని ప్రధాన వెబ్‌సైట్లలోని 3,13,000 మంది ప్రొఫైల్ ని అధ్యయనం చేశారట.వెబ్‌సైట్‌లోని ఫారం లో కులాంతర వివాహానికి మీరు సిద్దమేనా అని అడుగగా అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని, అయితే ఉత్తర భారత దేశంలో వారు మాత్రం అందుకు సరే నని చెప్పినట్టుగా నివేదించింది.

సామాజిక కార్యకర్తలు , వివిధ సంస్థలు ఇలా ఎంతో మంది కులాంతర వివాహాల విషయంలో కృషి చేసినా సరే ప్రజల జీవితాల్లో కులం ఓ ముఖ్యమైన భాగంగానే ఇప్పటికీ ఉందని పరిశోధన చేసిన మిచిగాన్ యూనివర్సిటీ కి చెందిన అశ్విన్ రాజదేసింగన్ తెలిపారు.ఈ పరిశోధన వెబ్‌సైట్లలో వారి వారి ప్రొఫైల్‌ లో ఉన్న సమాచారం ప్రకారం అందించామని అన్నారు.