విడాకులు దరఖాస్తు చేసుకున్న రెండేళ్ళకి లాటరీలో కోట్లు వచ్చాయి...

అమెరికాలో భార్య భర్తల విడాకుల విషయంలో కోర్టు విచిత్రమైన తీర్పు ఇచ్చింది.భార్య భర్తలుగా ఉన్నప్పుడు అన్ని మంచి, చెడు కలిసి పంచుకున్నప్పుడు విడిపోయినపుడు కూడా అలాగే పంచుకోవాలని తీర్పు ఇచ్చింది.

 Michigan Man Wins Lottery During Divorce Must Share With Ex Wife1-TeluguStop.com

అసలు విషయంలోకి వెళ్తే మిచిగాన్‌కు చెందిన రిచార్డ్, తన భార్య మేరీతో విడాకులు తీసుకోవడానికి 2011లో దరఖాస్తు చేసుకున్నాడు.ఇక ఇద్దరు విడాకులకి దరఖాస్తు చేసుకున్నాక రెండేళ్లకు 2013లో రిచార్డ్ జెలాస్కోకు 556 కోట్ల 64 లక్షలు లాటరీ తగిలింది.

కేసు కోర్టులో ఉండగా రిచార్డ్‌కు లాటరీ తగలడంతో ఆ డబ్బు మొత్తం తనకే చెందుతుందని రిచార్డ్ భావించాడు.

అయితే వాళ్ల కేసును వాదించిన లాయర్ మాత్రం భార్యాభర్తలిద్దరూ డబ్బు సమానంగా పంచుకోవాలని వాదించాడు.

అయితే ఆ లాయర్ ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కేసు ఇన్నేళ్ళు వాయిదా పడుతూ వచ్చింది.తాజాగా ఫైనల్ హియరింగ్ కి వచ్చిన కేసును క్షుణ్ణంగా పరిశీలించిన జడ్జి ప్రైజ్ మనీ ఇద్దరూ చెరిసమానంగా పంచుకోవాలని తీర్పునిచ్చారు.

భార్యాభర్తలుగా కలిసున్నప్పుడు రిచార్డ్ కంటే మేరీనే ఎక్కువ సంపాదించిందని, పైగా ముగ్గురు పిల్లలు తల్లి మేరీతోనే జీవిస్తున్నట్టు లాయర్ గుర్తుచేశారు.నష్టాలను ఇద్దరూ కలిసి పంచుకున్నప్పుడు, లాభాన్ని కూడా కలిసే పంచుకోవాలని జడ్జి సూచించారు.

దీంతో తప్పనిసరి పరిస్థితిలో రిచార్డ్ తాను గెలుచుకున్న ప్రైజ్ మనీలో సగం తన భార్యకి ఇవ్వాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube