మిచిగాన్ గవర్నర్ సంచలన నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్రంలో ఫ్లేవర్డ్ ఈ-సిగరెట్లను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు.

 Michigan Governor Gretchen Whitmer Ban Sale Of Flavored E Cigarettes-TeluguStop.com

తద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ నిషేధాన్ని విధించిన తొలి రాష్ట్రంగా మిచిగాన్ నిలిచింది.గవర్నర్ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టం, మార్కెటింగ్‌ను నిషేధిస్తున్నట్లు మిచిగాన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకు ముందు ఈ సిగరెట్ల వాడకం, నిషేధంపై గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో తమ తొలి ప్రాధాన్యత చిన్నారుల క్షేమమేనని తెలిపారు.అలాగే ఈ-సిగరెట్లను తయారు చేసే కంపెనీలు కాండీ ఫ్లేవర్‌తో ఉండే ఉత్పత్తులను తక్షణం నిలిపివేయాలని కోరారు.

ఫెడరల్ ప్రభుత్వం మైనర్లకు ఈ-సిగరెట్ల అమ్మకాన్ని అడ్డుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది.

అయితే ఇది అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు.తాజాగా మిచిగాన్ నికోటిన్ ఉత్పత్తులను నిషేధించడంతో మరికొన్ని రాష్ట్రాలు ఇదే దారిలో నడుస్తాయని గవర్నర్ విట్మెర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu Michigan, Prohibit Sale-

కాగా ఈ- సిగరెట్ బ్యాటరీతో పనిచేస్తుంది.నికోటిన్‌తో ఉండే ద్రవ పదార్థాన్ని మండిచడం ద్వారా వెలువడే ఆవిరి ఒక రకమైన అనుభూతిని కలిగిస్తుంది.పెన్ను రీఫిల్ మార్చినట్లుగా దీనిని ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు.ఈ-సిగరెట్లలో ఉండే నికోటిన్ మెదడుపై ప్రభావం చూపుతుంది.సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ-సిగరెట్లు ఉపయోగపడుతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తుండటంతో మరింత మంది వీటికి బానిసలవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube