మిచిగాన్, మసాచుసెట్స్‌ను వణికిస్తున్న ఈఈఈ వైరస్

వేసవిలో ప్రమాదకరమైన దోమల ద్వారా సంభవించే ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (ఈఈఈ) వైరస్ బారిన పడి మిచిగాన్‌లో ఓ రైతు మరణించాడు.దీంతో ఈ వైరస్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది.

 Michigan Farmer Who Contracted With Eee-TeluguStop.com

సదరు రైతు పేరు జిమ్ వైట్ రైట్‌గా గుర్తించామని.ఈఈఈ వైరస్ వల్లే అతను మరణించినట్లు మిచిగాన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రతినిధి ధ్రువీకరించారు.

ఆగస్టు 19న జ్వరంతో అతను అనారోగ్యానికి గురయ్యాడని.కొద్ది గంటల్లోనే ఆరోగ్యం క్షీణించడంతో వైట్‌రైట్‌ను అత్యవసర గదికి తరలించినట్లు తెలిపారు.అతనికి చికిత్స అందించేందుకు గాను కొందరు స్థానికులు GoFundMe పేరుతో విరాళాలు సేకరించారు.నాలుగు వారాల చికిత్స అనంతరం ఆసుపత్రిలోనే వైట్ తుదిశ్వాస విడిచాడు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం ప్రకారం.మెదడు వాపుకు కారణమయ్యే దోమల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది.

Telugu Borne Eee, Michigan, Telugu Nri Ups-

దోమ ఒక వ్యక్తిని కుట్టిన తర్వాత నాలుగు నుంచి 10 రోజుల మధ్య లక్షణాలు కనిపిస్తాయి.అధిక జ్వరం, మెడ నొప్పి, తలనొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలు మొదలవుతాయి.ఈఈఈ సంక్రమించిన రోగులలో మూడింట ఒక వంతు మంది చినిపోయారు.ఈ వైరస్‌కు నిర్ధిష్టమైన చికిత్స లేదని… దోమలకు దూరంగా ఉండటమే ఏకైక మార్గమని వైద్యులు చెబుతున్నారు.

నవంబర్ 13 నాటికి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం 36 ఈఈఈ కేసులు నమోదయ్యాయి.వీటిలో మసాచుసెట్స్‌లో 12, మిచిగాన్‌ 10 కేసులు చోటు చేసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube