వేర్వేరు యాంగిల్స్ లో అద్భుతంగా ఆడిన బుడతడు,ఫిదా అవుతున్న నెటిజన్లు  

Michael Vaughan Impressed With Toddler\'s Perfect Cricket-michael Vaughan,telugu Viral News Updates,the Perfect Child Cricketer,toddler\\'s Perfect Cricket,upcomming Star Cricketer,viral In Social Media

క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉన్నారు.చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా క్రికెట్ అంటే ఎంతో అభిమానిస్తారు.అయితే మరి డైపర్ వేసుకున్న బుడతడు సైతం క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఒక డైపర్ వేసుకున్న చిన్నారి వచ్చే ప్రతీ బంతినీ తన బ్యాటు తో వేర్వేరు యాంగిల్స్‌లో కొడుతూ అద్భుతమైన కవర్ డ్రైవ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వేర్వేరు యాంగిల్స్ లో అద్భుతంగా ఆడిన బుడతడు,ఫిదా అవుతున్న నెటిజన్లు Telugu Viral News-Michael Vaughan Impressed With Toddler's Perfect Cricket-Michael Telugu Viral News Updates The Child Cricketer Toddler\'s Cricket Upcomming Star In Social Media

ఆ పిల్లాడు ఎప్పటికైనా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కి సూపర్ కేట్ అవుతాడని వాఘన్ జోక్ చేశాడు.ఈ వీడియోని ఫాక్స్ క్రికెట్ ట్విట్టర్‌లో షేర్ చేయడం తో ఒక్కసారిగా లైక్ లు సంపాదించుకుంది.అయితే కొందరు అయితే ఆ చిన్నారిని చూస్తే చిన్నప్పుడు క్రికెట్ ఆడిన సచిన్ గుర్తొస్తున్నాడని చాలా మంది అంటున్నారు.సచిన్ లాగే ఈ బుడతడు కూడా ఇండోర్‌లో ఆడుతున్నా ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ చేస్తూ బాల్‌ను చితకబాదడంపై నెటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు.

మొత్తానికి ఒక చిన్న బుడతడికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.ముఖకవళికల్లో స్టీవ్ స్మిత్‌ను షాట్స్ ఎంపికలో సచిన్ టెండూల్కర్‌ను ఇక టైమింగ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని గుర్తు చేస్తూ ఆ బుడతడు ఆడుతున్న స్ట్రోక్ ప్లేకు నెటిజన్లతో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా ముగ్దుడైపోయాడు.‘ఈ గడుగ్గాయి బహుశా ఇంగ్లాండ్ గడ్డపై పుట్టినట్లు ఉన్నాడు మొత్తం బ్యాటింగ్‌ నరనరాల్లో చొచ్చుకుపోయిందంటూ తెగ ప్రశంశల వర్షం కురిపించారు.