అదరకొడుతున్న "మైకేల్ " ట్రైలర్..!

సాయి చరణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న మైకెల్ సినిమా ట్రైలర్ విడుదలైంది.మే 9న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

 Michael Trailer Is Coming-TeluguStop.com

రంజాన్ పర్వదినం రోజున దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.మైకెల్ సినిమాను వన్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.సినిమాలో సాయి చరణ్ తేజ్ తో పాటు ఆదిత్య శివ, చిరంజీవి, చిన్న నరసింహులు, శేఖర్ జిఎంఎస్, జి.పవన్, మణిరాజ్, అవినాష్ మొదలగు వారు తమ నటనతో మెప్పించారు.వన్ మీడియా బ్యానర్ పై పార్థు రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 Michael Trailer Is Coming-అదరకొడుతున్న మైకేల్ ట్రైలర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాకు కిరణ్ దర్శకత్వం చేశారు.అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రవీణ్ కుమార్, సినిమాటోగ్రఫీని నవీన్ ప్రకాష్ అందించారు.

ఈ చిత్రం ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది.అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత పార్థు రెడ్డి సినిమా విశేషాలను పంచుకున్నారు.తాను సినిమాను చూశానని, చాలా బాగా వచ్చిందన్నారు.దర్శకుడు కిరణ్ స్టోరీ చెప్పిన దానికంటే చాలా బాగా తెరకెక్కించినట్లు తెలిపారు.సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే నటించినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వారిలా నటీనటులు అందరూ నటించడం గొప్ప విశేషమన్నారు.

కరోనా తీవ్రత వల్ల సినిమా థియేటర్లు లేకపోవడంతో సినిమాను విడుదల చేయలేకపోతున్నామన్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించి మొదటగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచిందన్నారు.

#Sai Charan Tej #Trailer #Realsed #Youtube

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు