చనిపోయాక కూడా కోట్లు సంపాదిస్తున్న మైఖేల్ జాక్సన్

పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాము.అలాగే పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము అని అందరూ అంటూ ఉంటారు.

 Michael Jackson Getting Crores Of Money After Death Also, Hollywood, Pop Singer,-TeluguStop.com

ఈ మధ్య ఉన్న జీవితంలో మనం ఏం సాధించాం అనేదాని గురించి అందరూ చెప్పుకుంటారు అని కూడా ఉంటారు.పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే చనిపోయాక కూడా అవి మనతో పాటు ఉంటాయి.

అయితే పేరు ప్రఖ్యాతలతో సంపాదిస్తే ఆ పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది.ఆ వచ్చే డబ్బు చనిపోయాక కూడా వారి కుటుంబాలకి అండగా ఉంటుంది.

చనిపోయినపుడు ఏమీ తీసుకొని పోకున్న పోయిన తర్వాత మన అనుకునేవాళ్లకి ఏదో ఒకటి ఇచ్చి పోవాలి అని కూడా అంటారు.అలా ఇవ్వగలిగేది అతి కొద్ది మాత్రమే.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ గాయకుడు, డాన్సర్ అయిన మైఖేల్ జాక్సన్ కూడా అలాగే తన వారసులకి చనిపోయాక కూడా కోట్ల ఆదాయం వచ్చేలా చేస్తున్నాడు.

Telugu Hollywood, Legendary, Michael Jackson, Pop-Latest News - Telugu

బ్రతికున్నంత కాలం గొప్పగా బ్రతకడానికి ప్రాధాన్యత ఇచ్చిన మైఖేల్ జాక్సన్ పాప్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఎదిగాడు.పేదరికంలో పుట్టినా తన గొంతుతో యావత్ ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్నాడు.స్వర రారాజుగా వేల కోట్ల రూపాయిలు సంపాదించాడు.

అయితే తన రూపాన్ని మార్చుకోవడం కోసం ఇష్టానుసారంగా ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం వల్ల చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.అయితే ప్రపంచ పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ ఈ లోకాన్ని విడిచి 11 ఏళ్లు అవుతోంది.

అయినా ఆయన పేరిట ఇప్పటికీ వేల కోట్ల ఆదాయం వచ్చిపడుతూనే ఉంది.చనిపోయేనాటికి 400 మిలియన్ డాలర్ల మేర అప్పులు ఉన్నా, ఇప్పుడవన్నీ తీరిపోయాయి.జాక్సన్ బ్రతికిలేకపోయినా అది ఎందుకు సాధ్యమయ్యింది అంటే ఆయన సంగీత సామ్రాజ్యాన్ని శాసిస్తున్న సమయంలో మ్యూజిక్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలే కారణం.తన పాటలపై వచ్చే రాయల్టీలు, ఆల్బమ్ లపై హక్కులు, లైసెన్సింగ్ ఒప్పందాల రూపేణా భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది.జాక్సన్ మరణించి 11 ఏళ్లు కాగా, అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.14,723 కోట్లు అంటే కింగ్ ఆఫ్ పాప్ హవా ఏమిటో మనకు అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube